Angry at Our Loved Ones : ఇంట్లో వారిపై కోపంతో, బయటివారితో ప్రేమగా ఉంటున్నారా? మీరు కూడా ఇంతేనా?
మన ఫ్యామిలీ మనల్ని అర్థం చేసుకోవాలని, మనం చెప్పేది విని అర్థం చేసుకోవాలని.. మనకు తోడుగా ఉండాలని కోరుకుంటాము. అలాంటివారి దగ్గర చిన్న విషయం కూడా పెద్దదిగా అనిపిస్తుంది. అందుకే తెలియకుండానే ఇంటి సభ్యులపై కోపం ఎక్కువగా వస్తుంది.
కానీ స్ట్రెంజర్స్ ముందు చాలామంది తమ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు. ఎందుకంటే వారిపై ఎలాంటి భావోద్వేగ భారం ఉండదు. వారు మనల్ని జడ్జ్ చేయరు. వారి నుంచి మనం ఆశించేది కూడా ఏమి ఉండదు. అందుకే వారితో రిలేషన్ ఎప్పుడూ సాఫ్ట్‌గా ఉంటుంది.
రోజంతా ఒత్తిడి, బాధ్యతలు, అలసట ప్రభావంతో చాలాసార్లు ఇంట్లోని వారిపై కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము. ఎందుకంటే ఎవరైనా బయట బలంగానే ఉండాలని చూస్తారు. అందుకే చుట్టూ ఉన్నవారిపై కోపం చూపించరు. ఇంటికి వచ్చిన తర్వాత దానిని దించుకునేందుకు కోపం, అసహనం చూపిస్తారు.
కొంతమంది తమ లోపలి బాధలను మాటల్లో చెప్పలేరు. వారికి ఏమి బాధ ఉందో కూడా వ్యక్తం చేయలేరు. అటువంటి పరిస్థితిలో మనస్సు ఆందోళనతో నిండుతుంది. చిరాకుగా మారుతుంది. దీని ప్రభావం వారికి దగ్గరైన వ్యక్తులపై పడుతుంది.
దీని వెనుక మానసిక స్థితి కూడా ఒక పెద్ద కారణం కావచ్చు. అతిగా ఆలోచించడం, ఆందోళన లేదా విచారం కారణంగా.. ఒక వ్యక్తి కోరుకోకపోయినా.. తాను వద్దు అనుకున్నా.. తన సంబంధాలలో దూరం పెంచుకుంటాడు. దీనివల్ల వారి ప్రవర్తన చెడ్డదని అనిపిస్తుంది. అయితే వాస్తవానికి వారు లోపల పోరాడుతున్నారని అర్థం.
కొన్నిసార్లు చిన్ననాటి అనుభవాలు కూడా ఈ రకమైన ప్రవర్తనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దీనివల్ల పెద్దయ్యాక సన్నిహిత సంబంధాలలో అభద్రత లేదా కోపం ఎక్కువగా కనిపిస్తుంది.