Relationship Advice : మీ గర్ల్‌ఫ్రెండ్ లేదా భార్యతో మాట్లాడేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఎందుకంటే
మహిళలు ముస్తాబవ్వడానికి చాలా ఇష్టపడతారు. కాబట్టి ఆ సమయంలో వారిని తొందరపెడితే అది వారికి నచ్చకపోవచ్చు. కాబట్టి వారికోసం సమయం కేటాయించి ఎదురు చూడండి. సినిమాలాంటివాటికి వెళ్లేప్పుడు ముందుగా వారిని సిద్ధంగా ఉండమని చెప్పండి. విసుక్కోకుండా.. ప్రేమగా చెప్పేందుకు చూడండి.
మీ పార్టనర్‌ని మీ అమ్మతో ఎప్పుడూ పోల్చకండి. ఎందుకంటే ఇది ఒకరకంగా మెచ్చుకున్నట్లు ఉన్నా.. కొన్నిసార్లు తప్పుగా కూడా అనుకోవచ్చు. మీ భాగస్వామికి మీ అమ్మతో మంచి సంబంధం లేకపోతే.. అది ఆమెకు బాధ కలిగించవచ్చు.
ఎవరి ఆహారపు అలవాట్లు వారికి ఉంటాయి. కాబట్టి ఫుడ్ విషయంలో జడ్జ్ చేయకపోవడమే మంచిది. పొరపాటున జడ్జ్ చేస్తే అది గొడవగా మారవచ్చు. కొత్త వంటకాన్ని ప్రయత్నిస్తున్నా లేదా కొంచెం భిన్నంగా తినాలని కోరుకున్నా జడ్జ్ చేయకపోవడమే మంచిది.
ఎక్స్ గురించి మాట్లాడటం రిలేషన్షిప్లో అతి పెద్ద రెడ్ ఫ్లాగ్. మీర ఎక్స్ గురించి చెడుగా మాట్లాడినా లేదా పొగిడినా రెండూ మీకు సమస్యలను కలిగిస్తాయి.
మూడ్ స్వింగ్స్ లేదా చిరాకులో ఉన్నప్పుడు పీరియడ్స్‌లో ఉన్నావా? అంటూ అడగకండి. ఇది చాలా కోపాన్ని రప్పించవచ్చు. వారి రియల్ ఫీలింగ్స్‌ని పీరియడ్స్‌గా చూస్తున్నారని బాధగా ఫీల్ అవ్వవచ్చు.
ఇలాంటి డ్రెస్ వేసుకున్నావేంటి అంటూ ఎప్పుడూ అడగకండి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. దుస్తుల విషయంలో వారి ఛాయిస్‌కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఒకవేళ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీరు వెళ్లిన పని తర్వాత డ్రెస్‌ల విషయంలో మీకు ఉన్న సమస్యను నిదానంగా చెప్పండి.
ఏదైనా విషయం చెప్పేప్పుడు నువ్వు సైలెంట్‌గా ఉండమంటూ చెప్పకండి. ఈ మాట కొందరికి కోపాన్ని రెట్టింపు చేస్తుంది. తమ భావోద్వేగాలను తేలికగా తీసుకుంటే ఆడవాళ్లకు నచ్చదు. కాస్త ఓపికతో వారు చెప్పింది వింటే సెట్ అయ్యే అవకాశం ఉంది.