Dussehra Celebrations : శ్రీలంకలో దసరాను ఎలా జరుపుకుంటారో తెలుసా? రావణ దహనం జరుగుతుందా?
శ్రీలంకలో హిందూ, బౌద్ధ సమాజాలు రెండూ దసరాను జరుపుకుంటాయి. ఆ సమయంలో ఇక్కడ దేవాలయాలను పూలతో, దీపాలతో అలంకరిస్తారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుని పూజిస్తారు.
అయితే శ్రీలంకలో దిష్టిబొమ్మలు కాల్చరు. రామాయణం ఆధారిత కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తారు. భారతదేశంలో రామలీలలాగే ఇక్కడ కూడా నృత్యం, నాటకం, సంగీతం ద్వారా రామాయణాన్ని ప్రదర్శిస్తారు.
ప్రాంతీయ వంటకాలు, మిఠాయిలు తయారు చేస్తారు. బంధువులు, ఇరుగు పొరుగువారితో కలిసి భోజనం చేస్తారు.
కొలంబో, క్యాండీ, నువారా ఎలియా, త్రికోమాలి, జాఫ్నా వంటి నగరాల్లో దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. త్రికోమాలిలోని కోనేశ్వరం ఆలయం, నువారా ఎలియాలోని దేవాలయాలలో పూజలు నిర్వహిస్తారు.
శ్రీలంకలో రావణుడిని చెడుగా భావించరు. రావణుడిని ఎల్లప్పుడూ ఒక తెలివైన పాలకుడిగా, గొప్ప పండితుడిగా గౌరవిస్తారు. అందుకే ఇక్కడ రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేయరు.
రామాయణం ప్రకారం.. లంకను శివుడు, కుబేరుడు బంగారంతో నిర్మించారు. తరువాత రావణుడు ఈ రాజ్యాన్ని పాలించాడు. అయితే ప్రస్తుతం శ్రీలంకలో అలాంటి బంగారు భవనానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఏవీ లభించలేదు. రామాయణంలో హనుమంతుడు బంగారు లంకను కాల్చివేసినట్లు వర్ణించారు. కానీ ఈ లంకకు సంబంధించిన ఆధారాలు ఏవీ అక్కడ లభించలేదు.