✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Cancer Myths : క్యాన్సర్‌కు కారణమంటూ ప్రచారంలో ఉన్న అపోహలు ఇవే.. క్లారిటీ ఇస్తోన్న వైద్యులు

Geddam Vijaya Madhuri   |  14 Jan 2026 09:00 AM (IST)
1

చాలా మంది మైక్రోవేవ్​లో ఆహారం వేడి చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని నమ్ముతారు. కానీ వైద్యులు దీనితో ఏకీభవించరు. ప్రస్తుతం వాడుకలో ఉన్న మైక్రోవేవ్-సురక్షిత ప్లాస్టిక్ కంటైనర్లు వేడి చేసినప్పుడు క్యాన్సర్ కారక రసాయనాలను విడుదల చేయకుండా తయారు అవుతాయి.

Continues below advertisement
2

మొబైల్ ఫోన్ల గురించి కూడా చాలా కాలంగా ఒక భయం ఉంది. వాటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా మెదడు క్యాన్సర్. కానీ నిపుణులు ఏమంటున్నారంటే.. మొబైల్ ఫోన్ల వాడకం పెరిగినప్పటికీ, బ్రెయిన్ ట్యూమర్ కేసుల్లో ఎటువంటి అసాధారణ పెరుగుదల కనిపించలేదు.

Continues below advertisement
3

కృత్రిమ స్వీటెనర్ల గురించి కూడా క్యాన్సర్ భయం వ్యాప్తి చెందింది. అయితే పెద్ద ఎత్తున జరిగిన పరిశోధనల్లో వాటి వినియోగానికి, క్యాన్సర్కు మధ్య ప్రత్యక్ష సంబంధం ఏమీ రుజువు కాలేదు. ఎక్కువ వాడకం జీవక్రియ ఆరోగ్యంపై ప్రభావం చూపింది.

4

ఎక్స్ రే, మెమోగ్రఫీ గురించి కూడా చాలా మంది ఆందోళన చెందుతారు. నిజం ఏమిటంటే ఈ పరీక్షలలో ఉపయోగించే రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడానికి సరిపోదు.

5

జుట్టు రంగు, కేశాలంకరణ ఉత్పత్తులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. పరిశోధనలో కొన్ని ప్రత్యేక సమూహాలలో స్వల్ప ప్రమాదం ఉన్నట్లు తేలింది. కానీ ఇవి నేరుగా క్యాన్సర్కు కారణమవుతాయని ఇప్పటివరకు ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు.

6

బ్రాలను వేసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందనే భయం పూర్తిగా అపోహ మాత్రమే. అనేక శాస్త్రీయ అధ్యయనాలు బ్రా డిజైన్ లేదా బిగుతు క్యాన్సర్తో సంబంధం కలిగి లేదని స్పష్టం చేశాయి.

7

డియోడరెంట్, యాంటిపెర్స్పిరెంట్ వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందని కూడా చెబుతారు. కానీ ప్రధాన ఆరోగ్య సంస్థల ప్రకారం.. వాటి వాడకం వల్ల రొమ్ము క్యాన్సర్ లేదా మరే ఇతర క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఎటువంటి ఆధారాలు లేవు.

8

ప్యాకేజ్డ్ ఫుడ్ లో వాడే ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ కూడా భయానికి కారణం అవుతున్నాయి. అయితే ఈ ఫుడ్ ఎడిటివ్స్ నిర్ణీత ప్రమాణాల ప్రకారం వాడతారు. సాధారణ మోతాదులో వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండదని భావిస్తారు.

9

ధూమపానం చేసేవారికి మాత్రమే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందనేది నిజం కాదు. ధూమపానం దీనికి అతిపెద్ద కారణం కావచ్చు. కానీ కాలుష్యం, సెకండ్ హ్యాండ్ పొగ, జన్యుపరమైన కారణాల వల్ల ధూమపానం చేయని వారికి కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Cancer Myths : క్యాన్సర్‌కు కారణమంటూ ప్రచారంలో ఉన్న అపోహలు ఇవే.. క్లారిటీ ఇస్తోన్న వైద్యులు
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.