Invest Small & Gain Big : కొత్త సంవత్సరం నుంచి ఖర్చులు తగ్గించి ఈ పని చేయండి.. ఫ్యూచర్లో మంచి లాభం పొందుతారు
మ్యూచువల్ ఫండ్ SIP మీకు ఈ విషయంలో సహాయపడుతుంది. SIP ఒక సాధారణ, క్రమశిక్షణతో కూడిన మార్గం. దీనిలో మీరు ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడతారు. ఇందులో పెద్ద మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు.
చిన్న అడుగుతో మొదలుపెట్టి.. మీరు క్రమంగా భవిష్యత్తులో సాధారణ ఖర్చులకు మద్దతు ఇచ్చే ఒక ఫండ్ను తయారు చేయవచ్చు. మీరు ప్రతి నెలా 5000 రూపాయల SIPని ప్రారంభిస్తే.. మీ పెట్టుబడి సంవత్సరానికి 60000 రూపాయలు అవుతుంది. సగటు రాబడి సంవత్సరానికి దాదాపు 12 శాతం ఉంటే.
అయితే ఈ డబ్బు దీర్ఘకాలంలో వేగంగా పెరుగుతుంది. 5 సంవత్సరాలలో మీరు మొత్తం 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెడతారు. 12 శాతం అంచనా రాబడితో.. దీని విలువ దాదాపు 4.1 లక్షల రూపాయలకు చేరుకుంటుంది. అంటే అదనపు ప్రయత్నం లేకుండా దాదాపు 1.1 లక్షల రూపాయల లాభం.
ఈ డబ్బు అత్యవసర లేదా చిన్న నెలవారీ ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది. ఇదే SIP 10 సంవత్సరాల పాటు కొనసాగితే.. మీ మొత్తం పెట్టుబడి 6 లక్షల రూపాయలు అవుతుంది. ఇదే రాబడితో 10 సంవత్సరాల తర్వాత ఫండ్ విలువ దాదాపు 11.5 నుంచి 12 లక్షల రూపాయల వరకు ఉండవచ్చు.
SIPలో పెద్ద బలం ఫ్లెక్సీబిలిటీ. మీ శాలరీ ఎలా అయితే పెరుగుతుందో.. అలాగే మీరు SIP అమోంట్ కూడా పెంచుకోవచ్చు. 5000 నుంచి 7000 లేదా 10000 రూపాయలవరకు పెంచుకోవచ్చు. దీనిని step up SIP అంటారు. ఇది రిటర్న్ ఇంకా వేగంగా పెంచుతుంది.
కొత్త సంవత్సరం నుంచి మీరు SIP ప్రారంభిస్తే కొన్ని సంవత్సరాలలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. నెలవారీ ఖర్చుల కోసం ప్రతిసారీ జీతం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. పెట్టుబడి నుంచి వచ్చే ఆదాయం మిమ్మల్ని మరింత సురక్షితంగా, ఆత్మవిశ్వాసంతో ఉంచుతుంది.