Tips to Avoid AC Blasting : AC పేలిపోవడానికి కారణాలివే... అవుట్డోర్, ఇండోర్ యూనిట్లను ఎలా చూసుకోవాలో తెలుసా?
ఏసీని ఉపయోగించేప్పుడు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే రాంగ్ కరెంట్ కనెక్షన్. వైరింగ్ బలహీనంగా ఉన్నప్పుడు లేదా సర్క్యూట్ ఓవర్లోడ్ అయినప్పుడు ఏసీపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మెషన్ నెమ్మదిగా నష్టం కలిగిస్తుంది. ప్రారంభంలో వేడి లేదా స్పార్క్ మాత్రమే కనిపిస్తుంది. కానీ శ్రద్ధ తీసుకోకపోతే పేలుడు ప్రమాదం ఎక్కువ అవుతుంది.
అంతేకాకుండా AC ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్లను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇండోర్ యూనిట్ ఫిల్టర్లు, వెంట్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మురికి పేరుకుపోవడం వల్ల గాలి ప్రవాహం ఆగిపోతుంది. దీనివల్ల మిషన్ కూడా వేడెక్కుతుంది. ఈ వేడి క్రమంగా అంతర్గత భాగాలకు నష్టం కలిగిస్తుంది.
అందువల్ల రెగ్యులర్గా ఏసీని శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చల్లదనం పెరగడమే కాకుండా పేలుడు ప్రమాదం కూడా తగ్గుతుంది. దీనితో పాటు అవుట్డోర్ యూనిట్ పై కూడా శ్రద్ధ వహించాలి. చాలామంది దీన్ని బహిరంగ ప్రదేశంలో వదిలేస్తారు. దీనివల్ల ధూళి, సూర్యరశ్మి రెండూ ప్రభావం చూపుతాయి. కాబట్టి యూనిట్ నేరుగా ఎండ తగలకుండా ఉండేలా చూసుకోండి.
సూర్యరశ్మి నేరుగా పడితే యూనిట్ వేడెక్కిపోతుంది. ఏసీపై ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాకుండా ఇండోర్ యూనిట్‌లో వింత వాసన లేదా ఎక్కువ వేడి అనిపిస్తే.. మీరు వెంటనే తనిఖీ చేయించుకోవాలి. AC పనిచేసేటప్పుడు ఏదైనా శబ్దం వస్తే అప్రమత్తంగా ఉండాలి.
స్పార్కింగ్, పెద్ద శబ్దం లేదా వింత శబ్దం వస్తున్నాయంటే అవి AC కి అత్యంత ప్రమాదకరమైన సంకేతాలుగా చెప్తారు. అలాంటి సమయంలో మీరేమీ చేయడానికి ప్రయత్నించకండి. ప్లగ్ తీసివేసి ACని ఆపివేయండి. టెక్నీషియన్ని పిలిచి చెక్ చేయించుకోవాలి.
సురక్షితంగా ఉండటానికి సులభమైన మార్గం సకాలంలో సర్వీసింగ్ చేయించుకోవడం. అలాగే ఎల్లప్పుడూ అసలైన స్పేర్ పార్ట్స్ వినియోగించాలి. ఇండోర్, అవుట్డోర్ యూనిట్ల రెండింటినీ సరిగ్గా చూసుకోవడం ద్వారా AC ఎక్కువ కాలం మన్నుతుంది. ప్రమాదాల సంభావ్యత కూడా తగ్గుతుంది.