Chicken or Fish : బరువు పెరగడానికి చేప బెటరా? చికెన్ మంచిదా? ఆరోగ్యానికి ఏది మంచిదంటే
ప్రోటీన్ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో కలిసి కండర ద్రవ్యరాశిని పెంచడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి అధిక-నాణ్యత గల ప్రోటీన్ అవసరం.
ముఖ్యంగా చికెన్ లెగ్, డ్రమ్ స్టిక్స్లలో కొవ్వు, కేలరీలలో ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి అవసరం. అలాగే ఇందులో ఐరన్, జింక్, సెలీనియం కూడా పుష్కలంగా ఉంటాయి.
చికెన్ బ్రెస్ట్ లో ఫ్యాట్‌కు మంచి ఎంపిక. ఇది సన్నని కండరాలను బలోపేతం చేస్తుంది. అయితే ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగాలనుకుంటే, ఎక్కువ కొవ్వు వద్దునుకుంటే ఇది బెస్ట్ అవుతుంది.
చేపలలో కూడా మంచి మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. అయితే దీనిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కండరాలు కోలుకోవడానికి సహాయపడతాయి. కాబట్టి చేపలు బరువు పెరగడానికి కూడా సహాయపడవచ్చు.
చేపలు సాధారణంగా కోడి మాంసం కంటే తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. కాబట్టి చేపలపై ఆధారపడి వేగంగా బరువు పెరగడం కష్టం కావచ్చు. కానీ ఇది ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి గొప్ప ఎంపిక.
బరువు పెరగడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే.. ఆహారంలో కోడి, చేప రెండింటినీ చేర్చుకోవచ్చు. ఇది శరీరానికి ఎక్కువ కేలరీలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది. సరైన రీతిలో వండుకుంటూ.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.