Benefits of Eating Raw Garlic Before Bed : రాత్రుళ్లు పచ్చి వెల్లుల్లి తినొచ్చా? ఆ సమస్యలుంటే మాత్రం కచ్చితంగా తీసుకోవాలట
వెల్లుల్లి రెబ్బలను రోజు ఓ రెండు తింటే.. ముఖ్యంగా రాత్రి తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏమిటో నిపుణుల సలహాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగుండె ఆరోగ్యానికి మంచిది. వెల్లుల్లి శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. ట్రైగ్లైజెరిడ్స్ని తగ్గించి.. హృదయ సంబంధ వ్యాధులను దూరం చేస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి. ఉన్న ఇన్ఫెక్షన్లను తగ్గించి హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం ఇస్తాయి.
బీపీ ఉన్న వారు రెగ్యూలర్‌గా దీనిని తీసుకుంటే మంచిది. ఇది రక్తంలో ప్రెజర్‌ని తగ్గించి.. మెరుగైన రక్తప్రసరణ అందిస్తుంది. దీనివల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది.
దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు స్కిన్ డ్యామేజ్‌ని తగ్గిస్తాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో వేడిని తగ్గించడంతో పాటు.. ఆర్థ్రరైటిస్ని కూడా తగ్గేలా చేస్తాయి.
వెల్లుల్లిలోని ప్రోబయోటిక్ లక్షణాలు మెరుగైన జీర్ణ వ్యవస్థను అందిస్తాయి. కడుపు ఉబ్బరం, వివిధ రకాల గ్యాస్ సమస్యలను కంట్రోల్ చేసి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ముఖ్యంగా వెల్లుల్లిని రాత్రుళ్లు తీసుకుంటే ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది. నిద్ర సమస్యతో ఇబ్బంది పడేవారు దీనిని రెగ్యూలర్‌గా తీసుకుంటే మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది.
ఇది శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. చెడు కొవ్వు పేరుకుపోకుండా హెల్తీగా ఉండేలా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల పింపుల్స్ కూడా రావు. స్కిన్ క్లియర్‌గా ఉంటుంది.
ఆరోగ్యానికి మంచిది కదా అని దీనిని ఎక్కువగా తీసుకుంటే సమస్యలు ఎక్కువ అవుతాయి. రోజుకు ఒకటి లేదా రెండు రెబ్బలు మాత్రమే తీసుకోవాలి. ఈ రోటీన్ని ఫాలో అయ్యే ముందు నిపుణులు, డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.