Hair Wash Tips : తలస్నానం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. వారానికి ఎన్నిసార్లు చేస్తే జుట్టుకు మంచిదంటే..

తలస్నానం ఎన్నిరోజులకు ఓసారి చేయాలంటే
వారానికి 2 లేదా 3 సార్లు తలస్నానం చేయడం చాలామందికి సరిపోతుంది. అయితే జుట్టు జిడ్డుగా మారడం, ఎక్కువగా చెమట పట్టడం వంటి వాటిని బట్టి ఫ్రీక్వెన్సీ మార్చుకోవచ్చు.
వ్యాయామం లేదా ఎక్కువ శారీరక శ్రమ వల్ల తలకు చెమట ఎక్కువగా పడితే.. అవసరాన్ని బట్టి మరింత తరచుగా తలస్నానం చేయవచ్చు. చెమట, మురికి ఎక్కువసేపు పేరుకోకుండా చూసుకోవాలి.
తలస్నానం చేసేటప్పుడు మీ స్కాల్ప్‌కు సరిపోయే మైల్డ్ షాంపూను ఉపయోగించడం మంచిది. షాంపూను జుట్టు మొత్తం కంటే స్కాల్ప్‌పై సున్నితంగా అప్లై చేయాలి.
వేడినీటితో ఎక్కువసేపు తలస్నానం చేస్తే స్కాల్ప్‌లోని సహజ నూనెలు తగ్గి పొడిబారే అవకాశం ఉంటుంది. గోరువెచ్చని లేదా సాధారణ ఉష్ణోగ్రత నీటిని ఉపయోగించడం మంచిది.
తలస్నానం సమయంలో గోళ్లతో స్కాల్ప్‌ను గట్టిగా రుద్దడం వల్ల చర్మానికి చికాకు కలగొచ్చు. వేళ్లతో సున్నితంగా మసాజ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి.
తడిగా ఉన్నప్పుడు జుట్టు సులభంగా తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి టవల్‌తో గట్టిగా రుద్దకుండా మెల్లగా తుడిచి, వీలైనంత వరకు సహజంగా ఆరనివ్వాలి.
ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారు తరచుగా తలస్నానం చేయాల్సి రావచ్చు. డ్రై లేదా కర్లీ హెయిర్ ఉన్నవారు మాత్రం తరచుగా షాంపూ చేయడం వల్ల మరింత పొడిబారే అవకాశం ఉండటంతో తమ స్కాల్ప్ అవసరానికి అనుగుణంగా రొటీన్ పెట్టుకోవాలి.