AP and Telangana Corona cases: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నమోదైన కరోనా కేసుల వివరాలివే..
ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల వ్యవధిలో 69,606 శాంపిల్స్ పరీక్షించగా.. 1,546 మంది కొవిడ్ బారిన పడ్డారు. కొవిడ్ తో చిత్తూరులో నలుగురు, కృష్ణా-3, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించగా.. శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కరి చొప్పున మృతి చెందారు. మెుత్తం మృతి చెందిన వారి సంఖ్య 13,428 కు చేరింది. 24 గంటల్లో 1940 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. మెుత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,35,061 చేరింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 20,170 గా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,08,921 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 609 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,46,606 అయ్యాయి. 24 గంటల వ్యవధిలో నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మెుత్తం మృతుల సంఖ్య 3,811కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 647 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,34,018కి చేరింది. ప్రస్తుతం 8,777 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.