Vimala Raman: కోలీవుడ్ విలన్ ని పెళ్లిచేసుకుంటున్న వరుణ్ సందేశ్ హీరోయిన్
మోడల్‌గా కెరీర్ ఆరంభించి ఆ తర్వాత హీరోయిన్‌గా ఎదిగింది విమలా రామన్. మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించిన ఆమె తెలుగులో 'ఎవరైనా ఎపుడైనా', 'కులుమనాలి', 'రాజ్', 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి', 'చట్టం', 'గాయం 2' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విమలా త్వరలో పెళ్లిపీటలెక్కనున్నట్టు టాక్.
కోలీవుడ్ హీరో కమ్ విలన్ వినయ్‌రాయ్‌తో ప్రేమలో ఉన్న విమల త్వరలోనే అతడితో ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది.
వినయ్ రాయ్ విషయానికి వస్తే 'ఉన్నాలే ఉన్నాలే' సినిమాతో తమిళ తెరకు పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే అమ్మాయిల మనసులు కొల్లగొట్టిన ఈ హీరో జయం కొందాన్, ఎంద్రెంద్రమ్ పున్నగై వంటి పలు హిట్ చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. తుప్పరివలన్ సినిమాలో విశాల్‌ను ఢీ కొట్టే విలన్‌గానూ అదరగొట్టాడు. డాక్టర్, ఈటీ (ఎవరికీ తలవంచడు) చిత్రాల్లో నెగెటివ్ పాత్రలతో ప్రేక్షకుల మెప్పు పొందాడు. ప్రస్తుతం సూర్య నిర్మిస్తున్న 'ఓ మై డాగ్' లో నటిస్తున్నాడు.
వరుస సినిమాల్లో నటించినప్పటికీ విమలా రామన్ కి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. 2019లో 'ఇరుత్తు' సినిమాలో నటించిన విమలా ఆ తర్వాత వెండితెరపై ప్రాజెక్టులకు సైన్ చేయలేదు. ఆ తర్వాత 'పబ్ గోవా' అనే తమిళ వెబ్ సిరీస్ లో నటించింది.
విమలా రామన్ (Image Credit: Vimala Raman/ Instagram)
విమలా రామన్ (Image Credit: Vimala Raman/ Instagram)