Ritika Singh Photos: బాక్సింగ్ బ్యూటీ న్యూ లుక్ అదిరింది
రియల్ బాక్సర్ అయిన రితికా సింగ్ 'ఇరుదుచుట్రు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సుధాకొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవన్ హీరో. అదే మూవీ తెలుగు రీమేక్ 'గురు'లోనూ రితికాసింగ్ నటించింది.
తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా ఆండవన్ కట్టలై, రాఘవా లారెన్స్ సరసన శివలింగా, అశోక్ సెల్వన్‌తో ఓ మై కడవులే తదితర సక్సెస్‌ఫుల్ మూవీస్ లో మెరిసింది
దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కొత్త చిత్రంలో ఐటమ్ సాంగ్ లో నటించింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రంలో కీలక పాత్రను పోషిస్తోంది. జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఙానవేల్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ఇప్పటికే నటి మంజువారియర్, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, తెలుగు నటుడు రానా, నటి దుషారా విజయన్ నటిస్తున్నారు. రితికాను ఇది లక్కీ చాన్సే అని చెప్పాలి
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రితికా ఎప్పటికప్పుడు వర్కౌట్ వీడియోస్ , ఫొటోస్ షేర్ చేస్తుంటుంది
Image Credit: Ritika Singh/Instagram