Satyabhama Serial March 4th Episode Highlights: సంజయ్ కి సత్య వార్నింగ్.. జనతా గ్యారేజ్ పెట్టిన క్రిష్..పస్ట్ కారు మహదేవయ్యదే - సత్యభామ మార్చి 4ఎపిసోడ్ హైలెట్స్!
తండ్రిని చూసేందుకు దొంగలా వచ్చిన క్రిష్ గోడపై ఫొటో చూసి ఈ ఫొటో నాపై ఉందంటే నీకు నాపై ప్రేమ ఉందని అర్థమైంది బాపు అనుకుంటాడు. రూమ్ లోకి వెళ్లి చాటుగా మహదేవయ్యను చూస్తాడు...
అప్పుడే బయటకు వచ్చన సంజయ్..క్రిష్ ని చూసి దొరికావురా అనుకుంటూ దొంగా దొంగా అని హడావుడి చేస్తాడు. అంతా బయటకు వచ్చి క్రిష్ ని పట్టుకుని ముఖానికి కశ్చీఫ్ తీసి చూసి షాక్ అవుతారు...ఇంట్లో బంగారం కోసం వచ్చావా అని సంజయ్ అవమానిస్తాడు. ఎందుకొచ్చావ్ అని భైరవి అడ్డుపడుతుంది. జయమ్మ సర్దిచెబుతున్నా కానీ ఎవ్వరూ వినరు. చక్రవర్తిని అవమానిస్తుంటే బాబాయ్ ని ఏమీ అనొద్దు అంటాడు. ఇంకా బాబాయ్ ఏంటి అని సంజయ్ అవమానిస్తాడు.
ఇంట్లో బంగారం కోసం వచ్చావా అని సంజయ్ అవమానిస్తాడు. ఎందుకొచ్చావ్ అని భైరవి అడ్డుపడుతుంది. జయమ్మ సర్దిచెబుతున్నా కానీ ఎవ్వరూ వినరు. చక్రవర్తిని అవమానిస్తుంటే బాబాయ్ ని ఏమీ అనొద్దు అంటాడు. ఇంకా బాబాయ్ ఏంటి అని సంజయ్ అవమానిస్తాడు.
మనసులో ఏదో ప్లాన్ పెట్టుకుని ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని భైరవి అవమానిస్తుంది. క్రిష్ ఫొటోస్ కాల్చేస్తుంది.
సంజయ్ క్రిష్ కాలర్ పట్టుకుని తోసేస్తుంటే సత్య వచ్చి లాగిపెట్టి కొడుతుంది. క్రిష్ తనని తాను మర్చిపోతే నువ్వు అనేవాడివి ఉండవు అంటుంది. వద్దన్నా వచ్చావ్ ...
బాపు అని వెంపర్లాడుతున్నావ్.. ఇంత జరుగుతున్నా ఆన ఏమీ మాట్లాడడం లేదు..ఇంకోసారి క్రిష్ ని అవమానిస్తే చూస్తూ ఊరుకోను అంటుంది
ఈ బాధ తట్టుకోవడం నా వల్ల కాదు సత్యా అని క్రిష్ బాధపడతాడు..నేను బాధపడకూడదు అంటే నువ్వు ధైర్యంగా ఉండాలి అంటుంది సత్య.
ఈ ఇంటికి కలికాలం వచ్చింది ఇక్కడ ఎవరూ మనుషుల్లా ప్రవర్తించడం లేదు నేను వెళ్లిపోతాను అంటుంది జయమ్మ. మహదేవయ్య సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండదు
ఇప్పుడు వెళితే మళ్లీ ఈ ఇంట్లోకి రానివ్వను అంటుంది భైరవి. నన్ను మర్చిపోండి అని చెప్పేసి జయమ్మ వెళ్లిపోతుంది.
సత్యభామ మార్చి 05 బుధవారం ఎపిసోడ్ లో... మెకానిక్ షాప్ పెడదాం అనుకున్నా అని చెబితే సత్య సంతోషిస్తుంది.
కారు రిపేర్ అయి రోడ్డుపై ఉన్న మహదేవయ్య దగ్గరకు వెళ్లి బాధపడతాడు క్రిష్. పాత కారు, పాత మనుషుల్ని వదిలించుకోవాలని అందుకే చెప్పానని కఠువుగా మాట్లాడుతాడు మహదేవయ్య