Satyabhama Serial Today November 18th Highlights : మహదేవయ్య తండ్రి కాదని తెలుసుకున్న క్రిష్ దారెటు - సత్యభామ నవంబరు 18 ఎపిసోడ్ హైలెట్స్!
సత్యభామ సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.. క్రిష్ తండ్రి మహదేవయ్య కాదని సత్యకి తెలిసిపోయింది..అప్పటి నుంచి క్రిష్ అసలు తండ్రి ఎవరో కనుక్కునే ప్రయత్నంలో ఉంది
మహదేవయ్యతో ఛాలెంజ్ చేసిన సత్య.. క్రిష్ పుట్టిన హాస్పిటల్ కి వెళ్లి ఫైల్స్ చూసి అవాక్కైంది..ఆ రోజు కేవలం మహదేవయ్య - చక్రి భార్యలు మాత్రమే ప్రసవం అయినట్టు ఉంటుంది...దాంతో సత్యకి డౌట్ వస్తుంది
గన్ చూసి భయపడిన సంజయ్ ని చూసి నవ్వుతారు క్రిష్-సత్య..అందుకు హర్ట్ అయిన సంజయ్ గన్ తో గేమ్ ఆడేందుకు దిగుతాడు. ఆ టైమ్ లో మహదేవయ్య సంజయ్ ని, చక్రవర్తి క్రిష్ గురించి కంగారుపడడం సత్య గమనిస్తుంది
హాస్పిటల్లో ఆ రోజు వీళ్లిద్దరే పుట్టడం... మహదేవయ్య సంజయ్ గురించి కంగారు పడడం చూస్తుంటే సత్యకి డౌట్ వస్తుంది. ఆ విషయాన్ని చక్రవర్తి ముందు బయటపెడుతుంది
బిడ్డల మార్పిడి హాస్పిటల్లో జరిగిందని నాకు తెలుసు..మీరు చెబితేనే పూర్తి నిజం తెలుస్తుంది అంటుంది సత్య. బిడ్డల మార్పిడి గురించి సత్యనోట విన్న చక్రవర్తి అవాక్కవుతాడు...
తప్పించుకునే అవకాశం లేకుండా చక్రవర్తిని లాక్ చేసింది సత్య..అప్పుడు నిజం చెప్పక తప్పదు.. ఈ మొత్తం విషయాన్ని క్రిష్ వినేస్తాడు. ఇప్పుడుంటుంది అసలు కథ
ఇన్నాళ్లూ మహదేవయ్య కన్న తండ్రి అని తను MLA అవడం కోసం ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా అండగా నిలిచాడు క్రిష్.. ఇప్పుడు తన కన్నతండ్రి మహదేవయ్య కాదని తెలిసి క్రిష్ ఏం చేస్తాడు. అసలు తండ్రి చక్రి విషయంలో క్రిష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు. సత్యభామ నవంబరు 18 ఎపిసోడ్ లో ఇదే హైలెట్ కాబోతోంది...