Satyabhama Serial Today November 15th Highlights : క్రిష్ ఎవరి కొడుకో సత్యకి తెలిసిపోయింది .. మహదేవయ్య కి పెద్ద షాకే ఇది - సత్యభామ నవంబరు 15 ఎపిసోడ్ హైలెట్స్!
ఒకే రోజు చక్రి, మహదేవయ్యల భార్యలు డెలివరీ అయినట్లు రికార్డ్స్‌లో చూసిన సత్య ఇంకా ఎవరైనా అదే రోజు ప్రసవించారా అని ఆరాతీస్తుంది.. ఇంకేం లేవని చెప్పిన కాంపౌండర్... ఏదో గోల్ మాల్ జరిగి ఉంటుందమ్మా వెళ్లండి అని బతిమలాడుతాడు..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకావాల్సిన సమాచారం దొరికిందా అని క్రిష్ అంటే.. ఆ మంచి మనిషికి మంచి జరిగేందుకు ఇంకా టైమ్ పట్టేట్టుందని రిప్లై ఇస్తుంది సత్య. ఎవరైనా ద్రోహం చేస్తున్నారా అని క్రిష్ అడిగితే..ఓ రకంగా అలాంటిదే అంటుంది..ఇంతలో మహదేవయ్య కాల్ చేస్తాడు
ఏంటి పనవ్వలేదా నేను నిన్ను వెంటాడుతూనే ఉన్నాను అంటాడు. అంటే మీలో ఓటమి భయం మొదలైందన్నమాట రావణ దహనాననికి సిద్ధంగా ఉండండి అని సత్య వార్నింగ్ ఇస్తుంది. మా బాపూ నాకు కాకుండా నీకు కాల్ చేశాడేంటి అంటాడు క్రిష్...
రేణుక దిగులుగా కూర్చుంటే భైరవి వచ్చి నోటికి పనిచెబుతుంది..మొగుడిని జైలుకి పంపించావ్, పిల్లలు లేరు ఇంక రెస్ట్ తీసుకోవడం తప్ప ఇంకే పని అని కించపరుస్తుంది. అంతా నీ కొడుకు వల్లే కదా అని రేణుక అనడంతో భైరవి షాక్ అుతుంది. మీ చిన్న కోడలిలానే పెద్ద కోడలు కూడా అత్తపై అరవడం మొదలెట్టిందంటుంది
కిడ్నాపర్లకు డబ్బులిచ్చి మైత్రిని కాపాడుతాడు హర్ష.. ఇదంతా తనపై ప్రేమే అని మురిసిపోతుంది మైత్రి.
సత్య రిజిస్ట్రర్‌లో పేర్ల గురించి ఆలోచిస్తుంటే క్రిష్ వచ్చి హగ్ చేసుకుంటాడు.. ఆమంచి మనిషి గురించి కాకుండా మన గురించి ఆలోచించు అంటాడు.
అప్పుడు సత్య ఓ రెండు బొమ్మలు తెచ్చి A, B అని సమస్య మొత్తం చెబుతుంది. ఆ రోజు ఇంకెవరూ డెలివరీ కానప్పుడు వాళ్లిద్దరే బిడ్డల్ని మార్చుకుని ఉండొచ్చు అంటాడు క్రిష్..
సత్యభామ నవంబరు 16 ఎపిసోడ్ లో .. సంజయ్ గన్ పట్టుకుంటాడు అది రియల్ గన్ ఆటలాడకు అంటాడు క్రిష్.. చేతకానప్పుడు గమ్మునుండాలి అంటుంది సత్య.. అప్పుడు క్రిష్-సంజయ్ గన్ గేమ్ ఆడుతారు. సంజయ్ వైపు గన్ గురిపెట్టగానే లాక్కుంటాడు మహదేవయ్య.. ఈ ఆటలో సంజయ్ కి మాత్రమే కాదు క్రిష్ కి కూడా ప్రమాదమే అంటాడు చక్రి..ఆలోచనలో పడుతుంది సత్య...