Satyabhama Serial Today November 11th Highlights : భయపడడం మొదలుపెట్టండి మహదేవయ్య .. సత్య కొత్త సవాల్ - సత్యభామ నవంబరు 11 ఎపిసోడ్ హైలెట్స్!
నేను తప్ప ఇంకెవ్వరు వరంగల్ MLA అయినా కానీ నా చిన్నకొడుకు బతకనీయడు అని పార్టీకి సంబంధించిన వ్యక్తిని బెదిరిస్తాడు మహదేవయ్య. ఎప్పుడూ బెదిరింపులతోనే పనికాదని కాల్ చేస్తాడు అట్నుంచి.. ఇప్పటికిప్పుడు 5 కోట్లు ఎట్లా తెస్తాం అని క్రిష్ అంటే.. వెళ్లి సీతారామ్ ని కలువు అంటాడు
మైత్రి ప్రయాణం సంగతి గుర్తుచేస్తుంది నందిని.. మీరుణం ఎలా తీర్చుకోవాలని మైత్రి అంటే..టైమ్ కి ఫ్లైట్ ఎక్కితే రుణం తీర్చుకున్నట్టే అని సెటైర్ వేస్తుంది నందిని. నువ్వు ఎంత హడావుడి చేసినా లాభం లేదు..నేను ఫారెన్ వెళ్లేది లేదంటుంది మైత్రి..
భోజనం దగ్గర మహదేవయ్య ఏదో ఆలోచనలో పడడం చూసి..ఏంటో చెప్పండి నేను చూసుకుంటాను అంటాడు సంజయ్. ముచ్చటపడుతున్నాడు కదా మావయ్య కొన్ని రోజులు క్రిష్ కి అప్పగించి ఆ హీరోగారికే అప్పగించొచ్చు కదా అంటుంది సత్య. నేను రెఢీగా ఉన్నానంటాడు క్రిష్.. ఈ రోజు నుంచి సంజయ్ కి అన్నీ నేర్పించు క్రిష్ అంటుంది సత్య..
ఇంక ఆపుతావా అని ఫైర్ అవుతాడు మహదేవయ్య..ఎందుకంత కోపం వచ్చందని జయమ్మ అడుగుతుంది. సత్య ఏ తప్పు మాట్లాడిందని క్రిష్ అడుగుతాడు. ఏదో చికాకులో అరిచాను ఏమీ అనుకోకు సత్యా అని మహదేవయ్య కవర్ చేస్తాడు. నీ చికాకేంటో చెప్పు అంటాడు క్రిష్.. వాడు చుట్టం చూపుగా వచ్చాడు...వాడికెందుకు ఇవన్నీ అంటాడు.. నేర్చుకుంటే నాకు పనికొస్తుంది కదా అంటాడు సంజయ్..
ఇంతలో వచ్చిన మహదేవయ్య తమ్ముడు..సంజయ్ ఏమంటున్నాడని అడుగుతాడు. కత్తిసాము, కర్రసాము నేర్చుకుంటానంటుండాన్ని సత్య అంటుంది. ఆ నిర్ణయం మా అన్నయ్యదే అంటాడు. సంజయ్ కి సంబంధాలు తీసుకొస్తాడు కానీ.. ఆ అందం నాకు సరిపోదు అంటాడు సంజయ్.. సత్య వైపు చూస్తూ..
ప్రమాదం అని తెలిసినా క్రిష్ ని డబ్బులకోసం పంపించేందుకు సిద్ధమవుతాడు మహదేవయ్య. సత్య అడ్డు పడుతుంది. క్రిష్ సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తాడు..సత్య మహదేవయ్యతో వాదనకు దిగుతుంది. నీకు MLA టికెట్ ముఖ్యమా నీ కొడుకు క్షేమం ముఖ్యమా అని జయమ్మ అడిగేసరికి మహదేవయ్య సైలెంట్ అయిపోతాడు...
క్రిష్ అసలు తండ్రి ఎవరో తెలుసుకుంటానంటుంది సత్య.. మీరు ఎక్కడైతే నిజాన్ని పాతిపెట్టారో అక్కడి నుంచి మొదలు పెడతా అంటుంది. నీ భర్త చేయి ఎప్పటికీ నా చేతిలోనే ఉంటుంది అంటాడు మహదేవయ్య...