Satyabhama Serial Mounika Samineni: 'సత్యభామ' సీరియల్ లో జిడ్డు మొహంతో చిరాగ్గా కనిపించే మైత్రి గురించి ఈ విషయాలు తెలుసా!
సత్యభామ సీరియల్ లో హర్ష స్నేహితురాలిగా నటిస్తోన్న మైత్రి అసలు పేరు మౌనిక సామినేని. ఈమె గతంలో వంటలక్క, పడమటి సంధ్యారాగం సీరియల్స్ లో మెరిసింది
తనకు నీడనిచ్చి సపోర్టుగా నిలిచిన స్నేహితుడు హర్ష కుటుంబాన్ని ముక్కలు చేయాలని కుట్రలు చేసే క్యారెక్టర్లో నటిస్తోంది మైత్రి
సీరియల్ స్టార్టింగ్ లో మైత్రిని అంతా కూల్ క్యారెక్టర్ అనుకున్నారు జాలిపడ్డారు..కానీ రాను రాను మైత్రిలో కుట్ర బయట పడడంతో ఆమెపై జాలి ప్లేస్ లో ప్రేక్షకులకు చికాకు మొదలైంది
పైగా జిడ్డు మొహంతో ఏదో కోల్పోయినట్టు కనిపించే మైత్రిని నెగెటివ్ క్యారెక్టర్లో అస్సలు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు సత్యభామ సీరియల్ అభిమానులు
కార్తీకదీపంలో వంటలక్కను సైడ్ చేసి డాక్టర్ బాబుని పెళ్లిచేసుకునేందుకు కుట్రలు చేస్తుంటుంది స్నేహితురాలు మోనిత. ఇప్పుడు హర్ష - నందిని విషయంలోనూ అదే ఫాలో అవుతోంది మైత్రి
మైత్రి అసలు రంగు బయటపడితే అప్పుడుంటుంది నందిని చేతిలో..ఇక హర్ష కూడా ఆమె మొహం కూడా చూడదు.. మరి మైత్రిలో మార్పు వస్తుందో లేదంటే నందిని చేతికి చిక్కుతుందో వెయిట్ అండ్ సీ