Satyabhama Serial Today December 20 Highlights : విశ్వనాథాన్ని బాపూ అని పిలిచిన క్రిష్.. మామకి షాక్ ఇచ్చిన సత్య- సత్యభామ డిసెంబరు 20 ఎపిసోడ్ హైలెట్స్!
క్రిష్ తో తన మనసులో మాట చెప్పాలి అనుకుంటుంది సత్య. కాసేపు కూర్చోబెడుతుంది.. కూల్ గా చెప్పాలి అనుకునే టైమ్ లో మహదేవయ్య పిలవడంతో క్రిష్ వెళ్లిపోతాడు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమావయ్యతో చేసిన సవాల్ విషయంలో వెనక్కు తగ్గలేను..కానీ క్రిష్ ఎప్పటికీ నా పక్కనే ఉండేలా చూడు అని దేవుడికి నమస్కారం పెట్టుకుంది. పూజ తర్వాత క్రిష్ కి బొట్టు పెట్టి హారతి ఇస్తుంది..మళ్లీ చెబుదాం అనుకుంటుంది ఇంతలో భైరవి రావడంతో ఆగిపోతుంది.
భైరవి బ్రాస్ లెట్ గిఫ్ట్ గా ఇస్తుంది..నీ భార్య ఏమిచ్చింది అంటే 44 అని చెబుతాడు..అవేంటి అంటే ఆన్సర్ చెప్పకుండా ఎస్కేప్ అవుతాడు. ఆ తర్వాత పాయసం తీసుకుని రమ్మని ఆర్డర్ వేస్తుంది భైరవి
రేణుక వచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుుంది..అప్పుడే నందిని కాల్ చేసి శుభాకాంక్షలు చెబుతుంది. ఫోన్లో కాదు నేరుగా వచ్చి విష్ చేసి గిఫ్ట్ ఇవ్వు అంటాడు. కొత్త కోరికలేంటి అన్నా అంటే.. సత్య, హర్ష, సంధ్యల రిలేషన్ చూస్తే నాక్కూడా చెల్లిప్రేమ కావాలి అంటాడు
సాయంత్రం పార్టీ ఉందని క్రిష్ అంటే..మీ బావ కూడా లేడు నేను రాను అంటుంది నందిని. నువ్వు వచ్చి కేక్ కట్ చేయాల్సిందే అని పట్టుబడతాడు... చాటుగా వింటుంది సంధ్య..తాను కూడా సంజయ్ కోసం వెళ్లాలి అనుకుంటుంది.
క్రిష్ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే ఎలాగైనా ఇప్పుడు చెప్పేయాలి అనుకుంటూ పాయసం తీసుకుని వెళుతుంది సత్య. చెప్పేలోగా సంజయ్ వస్తాడు. భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే డిస్ట్రబ్ చేస్తావా అంటుంది.
సంజయ్ పరాయివాడు కాదు కదా అని క్రిష్ అంటే..అవును ఈ ఇంటికి నువ్వే పరాయి వాడివి అంటుంది. వెంటనే సారీ చెప్పిన సత్య..చిరాకులో అయినా ఆ మాట అనొచ్చా అంటాడు.క్రిష్ చేతిలో ఉన్న పాయసం సంజయ్ తీసుకోవడం చూసి సత్య తిడుతుంది.
సత్య మాత్రం తాను చెప్పాలి అనుకున్న విషయం చెప్పలేకపోతున్నా అని బాధపడుతుంది. మళ్లీ చెప్పేందుకు ప్రయత్నించగా జయమ్మ వస్తుంది.
బర్త్ డే పార్టీకోసం ఏర్పాట్లు చేస్తుంది సత్య. ఇంతలో సంధ్యరావడంతో మరదలు అంటే ఇలా ఉండాలి. నందిని కూడా వచ్చి శుభాకాంక్షలు చెబుతుంది.
సంధ్య సంజయ్ కోసం వెతకడం గమనించి సత్య క్వశ్చన్ చేస్తుంది. ఏం లేదని అబద్ధం చెబుతుంది. సత్య సంధ్యని లోపలకు రమ్మంటుంది...లోపలకు వెళుతుండగా సంధ్యను రూమ్ లోపలకు లాగి డోర్ వేస్తాడు సంజయ్..
image 11