Karthika Deepam 2 February 8th Highlights : సంతోషంలో కార్తీక్, దీపలు దిష్టిపెట్టొద్దంటోన్న శౌర్య.. హోమాన్ని చెడగొట్టేందుకు జ్యోత్స్న పన్నాగం.. ఈరోజు కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే
దీప శివన్నారయణ ఇంటి నుంచి వెళ్లి తర్వాత జ్యోత్స్న పాప ఆపరేషన్‌కి డబ్బు ఇచ్చింది ఎవరా అని తెగ ఆలోచిస్తుంది. ఇంట్లో వాళ్ల పేర్లు రాసి.. ఎవరు ఇచ్చి ఉంటారో అనుకుంటూ శ్రీధర్‌పై డౌట్ పడుతుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
పూజ పనుల్లో దీప, కార్తీక్‌లు బిజీగా ఉంటారు. ఇంకా ఏమైనా కావాలంటే ముందే చెప్పేయండి. అప్పటికప్పుడు తీసుకురావలంటే నాతో అవ్వద అంటాడు కార్తీక్. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
అందరినీ హోమానికి పిలిచానని చెప్పగా.. కాంచన బయటవాళ్లు సొంతవాళ్లు అయ్యారు. సొంతవాళ్లు పరాయివాళ్లు అయిపోయారంటూ బాధపడుతుంది. దీంతో దీప బాధపడకండమ్మా.. అందరూ వస్తారని చెప్తుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
మాటాల్లో అనసూయ కార్తీక్‌కి దీప అంటే చాలా ఇష్టమంటే.. శౌర్య వచ్చి మా అమ్మానాన్నకు దిష్టిపెట్టకు అంటుంది. వాళ్లకి దిష్టి తీస్తానని పట్టుబడుతుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
శౌర్య ఆరోగ్యం గురించి తనకు చెప్పనందుకు స్వప్న కాశీతో గొడవపడుతుంది. దీంతో కాశీ.. కార్తీక్ చెప్పొద్దన్నాడు. అందుకే చెప్పలేకపోయానని సర్ది చెప్తాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
జ్యోత్స్న పేరు విన్న దాసు నిద్రలేచి.. నిజమైన వారసురాలు తాను కాదు. ఈ విషయం అందరికీ చెప్పాలి అంటాడు. మళ్లీ గతం మరచిపోవడంతో లోపలికి వెళ్లిపోతాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
శ్రీధర్‌కి కాల్ చేసి.. మావయ్య మీ అబ్బాయి మీరు ఒకటై పోయారా? మీరే డబ్బు ఇచ్చారా అని అడుగుతుంది. దీంతో శ్రీధర్ తనకి ఏమి ఇవ్వలేదని చెప్తాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
కానీ దీప ఇంటికి వచ్చిందని.. హోమానికి కావేరిని పిలిచిందని చెప్తాడు. దీంతో జ్యోత్స్నలో, శ్రీధర్‌లో కావేరి డబ్బులు ఇచ్చిందా అనే డౌట్ వస్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
కావేరి మీద డౌట్‌తో శ్రీధర్ ఇంట్లోని డాక్యూమెంట్స్‌ని వెతుకుతాడు. అలాగే నగలు లేవని చూస్తాడు. ఫిక్స్డ్ డిపాజిట్లు క్లోజ్ చేసినట్లు తెలిసి షాక్ అవ్వడంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)