Karthika Deepam 2 April 16th Highlights : సుమిత్రకు ఫోన్ చేసిన కాంచన, దశరథ్ బతకడం కష్టమే.. దీపకు ఉరిశిక్ష తప్పదా? కార్తీక దీపం 2 హైలెట్స్ ఇవే
సుమత్రి దగ్గరకు వచ్చిన జ్యోత్స్న తన కూతురు జోలికి వస్తే దీప ఊరుకోనని చెప్పింది. నా తండ్రి జోలికి వస్తే నేను కూడా అంతే ఊరుకోను అంటూ సుమిత్రతో చెప్తుంది జ్యోత్స్న.
తాతగారి దగ్గరికి వెళ్లి తన ప్లాన్ చెప్తుంది. దీపకు జీవితంలో బయటకు రాకుండా బెయిల్ కూడా రాకుండా చేస్తానని డిస్కస్ చేస్తుంది. శివన్నారాయణ కూడా సపోర్ట్ చేస్తాడు.
దీప అక్కడున్న కానిస్టేబుల్ని దశరథ్కి ఎలా ఉందో అడిగి తెలుసుకుంటుంది. ఆయనకు సీరియస్గా ఉందని.. మీకు బెయిల్ దొరకదని చెప్తాడు.
మరోవైపు కాంచన, అనసూయ ఏడుస్తూ ఉంటారు. కాంచనను సుమిత్రకు ఫోన్ చేయమని చెప్తుంది అనసూయ.
పారుకి కాంచన ఫోన్ చేస్తుంది. సుమిత్రకు ఫోన్ ఇచ్చి కాంచన చేస్తుందని చెప్తుంది. దీంతో కాంచన ఎందుకు ఫోన్ చేశావంటూ సీరియస్ అవుతుంది.
మీ అన్న ఉన్నాడా పోయాడా అని ఫోన్ చేశావా అని సుమిత్ర అంటే.. అసలు నువ్వు ఈ ఇంటి ఆడపడచువేనా అంటూ పారు తిట్టి ఫోన్ పెట్టేస్తారు.
కాంచనను ఓదార్చేందుకు కావేరి వస్తే.. ఆమె వెంటే శ్రీధర్ వస్తాడు. దశరథ్కి సీరియస్గా ఉంది. బతకడం కష్టమే. దీపకు ఉరిశిక్ష తప్పదని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది.