Guppedantha Manasu Rasagna Reddy: రిషి జీవితంలోకి సాక్షి(రసజ్ఞ) రీ ఎంట్రీ లేనట్టేనా!
గుప్పెడంత మనసు' సీరియల్ లో రిషిని దక్కించుకునేందుకు ఎంతకైనా తెగించే ప్రియురాలి పాత్రలో రసజ్ఞ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ఎన్ని కుట్రలు చేసినా ఎంత ప్రయత్నించినా రిషి మనసులో తను లేనని క్లారిటీ వచ్చిన తర్వాత కోపంగా వెళ్లిపోయింది సాక్షి. వెళ్లినప్పుడే మళ్లీ వస్తానని షాక్ ఇచ్చింది కూడా.
వసుకి పెళ్లైపోయిందనే బాధలో ఉన్న రిషిని ఓదార్చేందుకు మళ్లీ సాక్షి రీఎంట్రీ ఇస్తుందేమో అనుకున్నారంతా.. కానీ రిషికి నిజం తెలిసిపోవడంతో ఇక సాక్షి రీఎంట్రీ లేనట్టే అంటున్నారు..
అందం,నటనతో అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకుంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రసజ్ఞ...మహానటి, నాటకం, కథనం, రౌడీ బేబీ సహా పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. 'లవ్ బర్డ్స్', 'రొమాంటిక్ గర్ల్ ఫ్రెండ్' వెబ్ సిరీస్ లో నటించింది.
'ఆడదే ఆధారం' సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన రసజ్ఞ...ఆ తర్వాత 'మజిలీ', 'నా పేరు మీనాక్షి' సీరియల్స్ లో అందం, నటనతో మెప్పించింది. ప్రస్తుతం 'రావోయి చందమామ', 'ఇంటికి దీపం ఇల్లాలు' సీరియల్స్ లో నటిస్తోంది.
గుప్పెడంతమనసు సాక్షి(రసజ్ఞ) ఫొటోస్(Image credit: Rasagnya/Instagram)
గుప్పెడంతమనసు సాక్షి(రసజ్ఞ) ఫొటోస్(Image credit: Rasagnya/Instagram)
గుప్పెడంతమనసు సాక్షి(రసజ్ఞ) ఫొటోస్(Image credit: Rasagnya/Instagram)