Gundeninda Gudigantalu Today మే 21 ఎపిసోడ్: మీనాకి ఆంక్షలు పెట్టిన బాలు, షాక్ ఇచ్చిన శివ - గుండె నిండా గుడి గంటలు మే 21 ఎపిసోడ్ హైలెట్స్
బయటకు వెళుతున్న శివను అడ్డుకుంటారు పార్వతి, సుమతి..గుణ దగ్గరకే కదా వెళుతున్నావ్ వద్దు అంటారు. ఇంతలో మీనా వచ్చి ఎక్కడికి వెళతావ్ రెస్ట్ తీసుకో అంటుంది. పూలకొట్టు బాగానే నడుస్తోంది కదా అంటుంది సుమతి. ఆ గుణ దగ్గర పనిచేయవద్దు అంటారంతా. కానీ శివ పట్టించుకోడు..రౌడీగా బతుకుదాం అనుకుంటున్నావా అని ఫైర్ అవుతుంది
ఎవరిపై అంటే వాళ్లపై చేయి చేసుకునే మీ ఆయన రౌడీ అని రివర్సవుతాడు. క్లాస్ వేస్తుంది మీనా. ఆ గుణతో చేరి చెడిపోతున్నావనే కొడుతున్నాడు అంటుంది పార్వతి. లేనిపోని అభాండాలు వేస్తాడు. ఈ విషయంపై అడిగాననే ఇద్దరం మాట్లాడుకోవడం మానేశాం అంటుంది.అయితే అక్కను ఇక్కడికి రమ్మను అంటాడు. నా కాపురం సంగతి నేను చూసుకుంటా నువ్వు నీ చదువు సంగతి చూసుకో అంటుంది మీనా. నీ చెడు సావాసాలు వల్ల సుమతికి పెళ్లి సంబంధాలు రావు అంటుంది. అక్కలా డబ్బులేవని సుమతి అవమానం పడకూడదంటే డబ్బు సంపాదించాలి అనేసి వెళ్లిపోతాడు
అయితే అక్కను ఇక్కడికి రమ్మను అంటాడు. నా కాపురం సంగతి నేను చూసుకుంటా నువ్వు నీ చదువు సంగతి చూసుకో అంటుంది మీనా. నీ చెడు సావాసాలు వల్ల సుమతికి పెళ్లి సంబంధాలు రావు అంటుంది. అక్కలా డబ్బులేవని సుమతి అవమానం పడకూడదంటే డబ్బు సంపాదించాలి అనేసి వెళ్లిపోతాడు
మనోజ్ కారణంగా బాధపడుతున్నాని రోహిణి అంటుంది..ఇంతలో బ్లాక్ మెయిలర్ డబ్బుల కోసం కాల్ చేస్తాడు. ఏం చేస్తావో చేసుకో నా దగ్గర డబ్బుల్లేవని అంటుంది. వాళ్ల మేడం వచ్చి రోహిణికి వార్నింగ్ ఇస్తుంది
ఆటో కావాలని రాజేష్ ని బాలు అడుగుతాడు. కారు అలవాటయ్యాక ఆటో బాగోదు అంటాడు రాజేష్. ఇంతోల శివ వచ్చి ..ఈ డబ్బు కొట్టేశాను అనేకదా నా చేయి విరగ్గొట్టావ్ ఇదిగో డబ్బు తీసుకో..నా చేయి తిరిగి ఇవ్వు అని నిలదీస్తాడు
నేను గుణ దగ్గర పనిచేస్తున్నట్టు మా అక్కకు చెప్పి నాపైకి ఉసిగొల్పావ్..నీకు నాకు సంబంధం లేదు..ఇంకెప్పుడు మా అక్కను నా దగ్గరకు పంపొద్దు అని క్లాస్ వేస్తాడు. బాలు కొట్టబోతుంటే అందరూ అడ్డుకుంటారు
మీనా వంటచేయలేదని ప్రభావతి కోప్పడుతుంది. పూలకొట్టు పెట్టాక పట్టించుకోవడం లేదంటుంది. ఇంతలో పూలు ఆర్డర్ ఇచ్చిన ఓ అమ్మాయి వచ్చి మీనాకు డబ్బులు ఇస్తుంది.
ఇంటి ముందు పూలుకొట్టు పెట్టుకున్నావ్ రెంట్ కట్టు అంటుంది ప్రభావతి. అదే టైమ్ కి ఇంటికొచ్చిన బాలు ఫైర్ అవుతాడు. సత్యం చేతుల్లో డబ్బులు పెట్టి ఇది నీ డబ్బు అని చెబుతాడు
ప్రభావతి దగ్గర డబ్బులు కొట్టేసిన వాడు దొరికాడు..పోలీసులు పట్టుకున్నారు..ఆ డబ్బు ఇప్పుడు రికవరీ చేశారని సత్యానికి ఇస్తాడు. సత్యం చేతులో డబ్బులు పెట్టి నీ డబ్బు అని చెప్పిన బాలుని ..దొంగ గురించి ఆరాతీస్తారు. బాలు ఏమీ మాట్లాడలేక ఆగిపోతాడు.
గుండెనిండా గుడిగంటలు మే 22 ఎపిసోడ్ లో... మీ పుట్టింటికి ఎందుకు వెళ్లావ్ అని అడుగుతాడు బాలు. నీ తమ్ముడు ఉండే చోటుకి వెళ్లకూడదు అని క్లాస్ వేస్తాడు. మీనా కాల్ చేసి అడిగితే పొగరుగా మాట్లాడుతాడు శివ