Niranjan BS: వేద యష్ కాదు ఇకపై సత్యభామ క్రిష్!
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో యష్-వేదగా మెప్పించిన నిరంజన్-దెబ్ జానీ మోదక్ ఇప్పుడు సత్యభామ సీరియల్ లో నటిస్తున్నారు. ఈ సీరియల్ క్రిష్ పాత్రలో కనిపిస్తున్నాడు
1996 ఆగస్టులో జన్మించిన నిరంజన్ విద్యాభ్యాసం మొత్తం తాను పుట్టిన బెంగళూరులోనే జరిగింది. నిరంజన్ తల్లి టీచర్, తండ్రి క్యాటరింగ్ బిజినెస్ చేసేవాడు.
చిన్నప్పటి నుంచీ ఆర్మీలో జాయిన్ అవ్వాలనే కోరికతో స్కూల్, కాలేజీలో NCC చేశాడు. స్పోర్ట్స్ పట్ల చాలా ఆసక్తిగా చూపించేవాడు. కానీ దురదృష్టం వెంటాడింది. ఓ ప్రమాదంలో తన లిగిమెంట్ దెబ్బతిని ఆర్మీలో చేరాలన్న ఆశ కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాత రేడీయో జాకీగా, ఇప్పుడు సీరియల్ హీరోగా వెలుగుతున్నాడు
కన్నడ సీరియల్ 'గాంధారి' తో బుల్లితెరపై ప్రయాణం మొదలెట్టాడు. ఆ తర్వాత నిరంజన్ నటించిన నందిని సీరియల్ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలోనూ ప్రసారమైంది. ఈ సీరియల్ సక్సెస్ కావడంతో నిరంజన్ కి మంచి అవకాశాలు వచ్చాయి
సత్యభామ సీరియల్ ' క్రిష్' (నిరంజన్)
సత్యభామ సీరియల్ ' క్రిష్' (నిరంజన్)