Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode : వీలునామాను కాల్చేసిన మనీషా, దేవయాని.. ఫ్యాక్టరీ విషయం తెలుసుకున్న లక్ష్మీ ఏమి చేసిందంటే

ఆస్తిని తనకు జానుకి పంచితే సరిపోతుందని.. తన తమ్ముడికి అవసరం లేదని.. అతను మంచి పొజీషన్లో ఉన్నాడని లాయర్‌తో చెప్తుంది లక్ష్మీ. (Images Source : Zee Telugu)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
అలా కుదరదని రేపు ఎప్పుడైనా అతను కేసు పెడితే ప్రాబ్లమ్ అవుతుందని లాయర్ చెప్పగా.. తన తమ్ముడు చాలా మంచివాడని అక్కల సంతోషమే తనకి అవసరమని ఆస్తులు అవసరం లేదని చెప్తుంది. (Images Source : Zee Telugu)

మా తాతయ్య కూడా ఆస్తులు మా ఇద్దరికే రాశారు. మగ పిల్లాడు ఎలా అయినా బతకుతాడు అని వాడికి ఏం రాయలేదని లక్ష్మీ చెప్పగా తాతగారు కూడా సమర్థిస్తారు. దీంతో దేవయాని హమ్మయ్యా ఆస్తిలో మరో వాటా పెరిగిపోతుందని అనుకున్నా కానీ అలా జరగలేదని సంతోషపడుతుంది.(Images Source : Zee Telugu)
లాయర్ వీలునామా చూడాలని అడగడంతో తాతగారు వెతికి కనిపించడం లేదని చెప్తారు. దీంతో అందరూ షాక్ అయిపోతారు. లక్ష్మీ వీలునామ కనిపిస్తే పిలుస్తానని లాయర్ని పంపేస్తుంది. (Images Source : Zee Telugu)
జాను వెళ్లి మనీషా, దేవయానిలను వీలునామా ఏమి చేశారని అడగ్గా.. దానిని కాల్చేశామని.. నీ మంచికోసమే ఇది చేశామని షాక్ ఇస్తారు.(Images Source : Zee Telugu)
ఇదంతా వివేక్ విని చప్పట్లు కొడతాడు. మీ అందరికీ బాగా అయిందని వివేక్ అనగా.. జానుతో పాటు నువ్వు కూడా నష్టపోయావని మనీషా వివేక్‌కి కౌంటర్ ఇస్తుంది. నా ఆస్తి మీదే నాకు ఆశ లేదు జాను ఆస్తి ఎందుకు అని అంటాడు. (Images Source : Zee Telugu)
ఫ్యాక్టరీ కట్టడానికి కొందరు ఇబ్బంది పెడుతున్నారని ఊరి జనాలను కొనేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని లక్ష్మీకి విషయం తెలిస్తే ఊరుకోదని ఊరు బాగు పడటానికి లక్ష్మీ చాలా చేసిందని చెప్తారు. కానీ లక్ష్మీకి ఈ విషయం తెలిసిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.(Images Source : Zee Telugu)