Brahmamudi October 14th Episode: దొరికిపోయిన కనకం - రాజ్ చేతిలో మరోసారి కళావతి బలైపోతుందా ..బ్రహ్మముడి అక్టోబరు 14 ఎపిసోడ్ హైలెట్స్!
కనకానికి క్యాన్సర్ అని తెలియగానే రాజ్ కరిగిపోయాడు.. అత్త-మావయ్య 25వ పెళ్లిరోజు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేశాడు. దుగ్గిరాల వారి కుటుంబం మొత్తం కనకం ఇంటికి కదిలొచ్చింది. ఈ మొత్తం సందడి చూసి కావ్యలో ఏదో డౌట్ మొదలైంది కానీ క్లారిటీ రావడం లేదు అనుకుంటుంది
ఏంటి ఇదంతా అని రాజ్ ని అడిగినా..ఇద్దరి మధ్యా సెటైర్స్ పేలాయ్ కానీ అసలు విషయం మాత్రం రాజ్ చెప్పలేదు. తల్లికి క్యాన్సర్ అని తెలిస్తే కళావతి తట్టుకోలేదు అనుకుంటాడు రాజ్..అందుకే ఆ విషయం బయటపెట్టడు.
వాస్తవానికి కనకం క్యాన్సర్ డ్రామా కేవలం అపర్ణ, ఇందిరాదేవికి మాత్రమే తెలుసు..రాజ్- కావ్యను దగ్గరచేసేందుకు రాజ్ దగ్గర డ్రామా ఆడారు. ఇంట్లో మిగిలినవాళ్లకి ఎవ్వరికీ తెలియదు. రుద్రాణికి అనుమానం వచ్చింది కానీ ఏమీ అర్థంకాకుండా ఉంది..అసలు విషయం తెలిస్తే అప్పుడుంటుంది
తన ఇంటికి మొదటిసారిగా ముగ్గురు కూతుర్లు, ముగ్గురు అల్లుళ్లు రావడం చూసి మురిసిపోతారు కనకం-కృష్ణమూర్తి. వేడుక అంతా ఎవ్వరూ ఊహించనంత ఘనంగా జరుగుతుంది. మరోవైపు రాజ్ మాత్రం ప్రతిక్షణం అత్తగారికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు చెబుతూనే ఉంటాడు
అక్టోబరు 14 సోమవారం ఎపిసోడ్ లో హైలెట్ సీన్ అంటే మాత్రం రాజ్-కనకం డిస్కషనే. నా స్నేహితులు చాలామందితో మాట్లాడాను నాకు తెలిసిన క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నాడు...మీ రిపోర్ట్స్ ఇస్తే తనకి చూపిస్తానంటాడు రాజ్.. కనకం అవాక్కవుతుంది
లేని రోగానికి రిపోర్ట్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలనుకుంటుంది కనకం. ఇవ్వండి మిమ్మల్నే అని రాజ్ అడగడంతో లోపలకు వెళుతుంది కనకం.. అక్కడ కావ్య నిల్చుని ఉంటుంది.. చూస్తుంటే మొత్తం ఈ డ్రామా తనకు తెలిసినట్టే ఉంది. ఇదంతా డ్రామా అని రాజ్ కి తెలిసిపోతే లెక్కలు మారిపోతాయ్.