Brahmamudi Serial Today Episode May 20: జనాభా లెక్కల పేరుతో కావ్యను ఇరికించిన యామిని , రాజ్ రియాక్షన్ ఏంటి - బ్రహ్మముడి సీరియల్ మే 20 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: రాజ్ ఇంటికి వచ్చినా కానీ మాట్లాడొద్దు అని అపర్ణ కండిషన్ పెడుతుంది. మరోవైపు యామినికి నిజం తెలిసిపోయింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
Continues below advertisement
బ్రహ్మముడి సీరియల్ మే 20ఎపిసోడ్ Brahmamudi Serial Today May 20th Episode
Continues below advertisement
1/10
రాజ్ ముందు కావ్యను ఇరికించాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. నా ఫొటో ఎందుకు పెట్టారు పరువుతీయాలనా అని ఫైర్ అవుతుంది స్వప్న. రుద్రాణి ఏదో చెప్పి తప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది
2/10
రుద్రాణి రూమ్ నుంచి చికాకుగా వచ్చిన రాజ్ తో.. రెస్ట్ తీసుకున్నావా అని అడుగుతారు. నువ్వు అసలు కళావతి విషయంలో సీరియస్ గా ఉన్నావా లేవా అని అడుగుతుంది అపర్ణ. గిఫ్ట్ ఏది అని అడుగుతారు. గులాబీలతో పాటూ పట్టుచీర తీసుకొస్తాడు..
3/10
కావ్య రూమ్ లోకి వెళ్లిన రాజ్ ని ఎందుకొచ్చారని అడుగుతుంది. గిఫ్ట్ తీసుకొచ్చానని చెప్పి ఇస్తాడు. నాకు మోడ్రన్ డ్రెస్ అంటే ఇష్టమంటుంది కావ్య. ఆ డ్రెస్ చూసి పడిపోతుంది. మీరు ఒక్కసారి ఆ డ్రెస్ వేసుకుని రండి అని అడుగుతాడు. కావ్య ఒప్పుకుంటుంది.
4/10
రాజ్ ఇచ్చిన డ్రెస్ వేసుకుని వస్తుంది..చందమామలా ఉన్నావని కాంప్లిమెంట్ ఇస్తాడు రాజ్. ఇద్దరూ కలసిపోయినట్టు కలగంటుంది ఇందిరాదేవి. అపర్ణ పిలుపుతో బయటకొస్తుంది. నా కలే నిజమవుతుంది అంటుంది ఇందిరాదేవి.
5/10
లోపల పెద్ద అద్భుతం జరిగిందంటూ వస్తాడు రాజ్. రూమ్ లోకి డైరెక్ట్ గా వచ్చారేంటని చికాకు పడుతుంది కావ్య. డ్రెస్ గిఫ్ట్ ఇవ్వాలని వచ్చానంటాడు. ఆ డ్రెస్ ఓపెన్ చేసి రాజ్ వైపు కోపంగా చూసి కొట్టేందుకు వస్తుంది. పారిపోయి బయటకు వస్తాడు రాజ్
Continues below advertisement
6/10
నా ప్రయత్నాలు నేను చేసుకుంటాను..ఇలాంటి ఐడియాలతో కళావతి చేతిలో నన్ను బలిచేయొద్దు అనేసి వెళ్లిపోతాడు.
7/10
బెడ్‌పై కావ్య ఫొటో బదులు స్వప్న ఫొటో ఎలా వచ్చిందా అని ఆలోచిస్తుంటుంది రుద్రాణి. ఇంతలో యామిని కాల్ చేసి ఏం జరిగిందని అడిగితే.. అసలు విషయం చెబుతుంది రుద్రాణి.
8/10
మనం తిట్టుకోవడం కాకుండా నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం అంటుంది రుద్రాణి. ఇంట్లో అత్త, మావయ్య, తాతయ్య, నానమ్మ అంతా ఉన్నారు మరి అత్త కొడుకు ఏమనయ్యాడో అడగమంటుంది యామిని.
9/10
మీరు చేసే పనుల వల్ల నాకు భయం వేస్తోందంటుంది కావ్య. రాజ్ మనతో ఉంటే తనంతట తను గుర్తు చేసుునే అవకాశం ఉంటుంది అంటుంది ఇందిరాదేవి. తను నా దగ్గరకు వచ్చి ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నా అంటుంది
10/10
బ్రహ్మముడి మే 21 ఎపిసోడ్ లో... జనాభా లెక్కల పేరుతో మనుషుల్ని పంపిస్తుంది యామిని. అందరి ముందు కావ్య మీకు ఏమవుతారని అడిగితే ఇంట్లో అంతా షాక్ లో ఉండిపోతారు.. రాజ్ సందేహంగా చూస్తుంటాడు
Published at : 20 May 2025 09:50 AM (IST)