Brahmamudi Serial Today August 28th:రాజ్ కి మొత్తం తెలిపోయింది, యామిని ఇక సర్దేసుకోమ్మా - ‘బ్రహ్మముడి’ సీరియల్ ఆగష్టు 28 ఎపిసోడ్ హైలైట్స్!
తాగి వచ్చి రచ్చ మొదలుపెట్టిన రాజ్.. నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో చెప్పు చాలు..నేను నిన్ను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను పెళ్లి చేసుకుంటా అంటాడు రాజ్
ఇదే అవకాశంగా రెచ్చిపోతుంది యామిని. ఎవరి కారణంగానో కడుపు తెచ్చుకున్నా నువ్వు కరుణించి పెళ్లి చేసుకుంటానని చెప్పినా నీ మాట వినడం లేదంటే ఇలాంటి దాంతో ఎలా ఉంటావ్.. పద నిన్ను జీవింతాంతం నిన్ను ప్రేమగా చూసుకుంటాను అని చెబుతుంది
ఇంతలా అడుగుతున్నా ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పలేవా అని రాజ్ అంటే.. ఆ మనిషి ఎవరో తనకే తెలియదేమో.. పద్ధతిగా సంసారం చేసిన ఆడవాళ్లు తప్పుచేస్తే తప్పు ఒప్పుకుంటారు..ఇలాంటి బజారు మనుషులు అని యామిని మాటతూలేలోగా లాగిపెట్టి కొడుతుంది అపర్ణ
ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా కోడలి గురించి తక్కువ చేసి మాట్లాడుతావ్, నువ్వెంత నీ బతుకెంత నువ్వు నా కోడలి గురించి మాట్లాడుతున్నావా? పరాయి మగాడిని సొంతం చేసుకోవాలనే నువ్వు చిల్లర మనిషివి, నీలాంటి మనిషి నా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు..వెళ్లు ఇక్కడి నుంచి అంటుంది
తను కాదు నేను అడుగుతున్నా అదే ప్రశ్న..నాకు సమాధానం చెప్పు అంటాడు రాజ్. అంటే యామిని అన్నట్టు నిజంగానే తను ఎవరితోనో అని రాజ్ అనగానే రాజ్ చెంప పగులుతుంది. అది నీ భార్య అని నిజం బయటపెట్టేస్తుంది అపర్ణ. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వే అని మొత్తం చెప్పేస్తుంది అపర్ణ
తన ప్లాన్ ఫెయిలైందని యామిని తెగ బాధపడిపోతుంటుంది..రుద్రాణి షాక్ అవుతుంది. అదే టైమ్ లో యామిని నాటకం మొత్తం రాజ్ కి చెప్పేస్తుంది అపర్ణ.నువ్వు బావుండాలని, నీకు ఎలాంటి ప్రమాదం జరగకూడదనే అన్నీ భరిస్తూ వచ్చిందని చెబుతుంది అపర్ణ
అంతా విని రాజ్ కళ్లుతిరిగిపడిపోతాడు..వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అంతా కంగారుపడతారు..నిజం చెప్పాలంటే తన పరిస్థితి క్రిటికల్ గానే ఉందని డాక్టర్ చెప్పడంతో అపర్ణ ఏడుస్తుంది. పేషెంట్ స్పృహలోకి వస్తేకానీ ఏం చెప్పేలేం అనేస్తాడు
నావల్లే ఇదంతా జరిగిందని అపర్ణ కన్నీళ్లు పెట్టుకుంటుంది. రుద్రాణి, రాహుల్ సంతోషిస్తారు. అపర్ణా ఊరుకో అని ఇందిరాదేవి ఓదార్చుతుంది. వాడికి ఏం కాదు కంగారుపడకు అంటుంది. ధాన్యలక్ష్మి ధైర్యం చెబుతుంది. నన్ను క్షమించుకావ్యా అంటుంది అపర్ణ. రాజ్ స్పృహలోకి వచ్చాడని చెబుతాడు డాక్టర్
నీకేం కాలేదు కదా అని రాజ్ అడుగుతాడు..ఈ జీవితంలో మీ చేయి వదిలిపెట్టను అంటుంది కావ్య