Brahmamudi June 13th Episode: కనకం వచ్చేసింది ఇక యామినికి దబిడి దిబిడే, బుజ్జితల్లి సాంగేసుకున్న రాజ్ కావ్య - బ్రహ్మముడి జూన్ 13ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: రాజ్-కావ్యను మళ్లీ కలిపేందుకు దుగ్గిరాల కుటుంబం ప్లాన్ చేసుకుంటారు. కావ్యకు చెక్ పెట్టి రాజ్ ని పెళ్లికి ఒప్పిస్తుంది యామిని. బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
Continues below advertisement
బ్రహ్మముడి సీరియల్ జూన్ 13 ఏపిసోడ్
Continues below advertisement
1/9
కావ్య పక్కన్న నిల్చున్న రాజ్ ని తనదగ్గరకు లాగుతుంది యామిని..దుగ్గిరాల ఫ్యామిలి చూసి రగిలిపోతుంటారు. హారతి ఇవ్వమని కావ్యను పిలుస్తుంది యామిని. ఎవరు చేయాల్సిన పని వాళ్లు చేయాలంటూ మీ అమ్మను హారతి ఇవ్వమనండి అంటుంది కావ్య, ఇందిరాదేవి అదే మాట అంటుంది
2/9
ప్లాన్ ప్రకారం పెళ్లి రాట విరగ్గొడతారు అప్పు ఏర్పాటు చేసిన మనుషులు. అంతా షాక్ అవుతారు. ఇదంతా అరిష్టం పెళ్లి ఆపేయండి అంటాడు ముత్తైదవులు. ఈ పెళ్లిలో ఏదో దోషం ఉంది అందుకే ఇలా జరిగింది అంటుంది ఇందిరాదేవి. అందరూ వంతపాడతారు
3/9
యామిని చెప్పినట్లు వాళ్లకు నిశ్చితార్ధం అవగానే రామ్ కి యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్లిపోయాడు, ఇప్పుడు పెళ్లిరాట విరిగిపోయింది.. ఈ పెళ్లి కరెక్ట్ కాదేమో అంటుంది అపర్ణ. ఏవో దుష్ట శక్తులు ఈ పెళ్లి ఆపాలని ప్లాన్ చేస్తున్నారని అంటాడు శాస్త్రి.
4/9
ఈ పంతులు తోనే పెళ్లి ఆపేలా చేయాలి అనుకుంటుంది ఇందిరాదేవి..అలా జరగాలంటే బుల్డోజర్ లాంటి మనిషి కావాలంటుంది అపర్ణ. కనకం ఎంట్రీ ఇస్తుంది. ఈ విషయం ఇన్నాళ్లూ నాకెందుకు చెప్పలేదని నిలదీస్తుంది. నువ్వు గొడవచేస్తే మా ప్రయత్నం వృధా అయిపోతుందని ప్లాన్ చెబుతారు
5/9
నా నా కూతురి జీవితాన్ని నిలబెట్టడానికి నేను ఏమైనా చేస్తానని అంటుంది కనకం. రాజ్ ముందు మాత్రం నీ కూతురిని కావ్య అనొద్దు కళావతి అని పిలవాలి అని చెబుతారు జీవితం నిలబెట్టేందుకు ఏమైనా చేస్తాను అంటుంది కనకం. తల్లిని చూసి కావ్య షాక్ అవుతుంది. నీ పిచ్చి చేష్టలతో ఇక్కడ పొరపాట్లు చేయొద్దు అంటుంది కావ్య. ఈ పెళ్లి జరగదు అని నాకు నమ్మకం ఉందంటుంది కావ్య
Continues below advertisement
6/9
కనకాన్ని చూసిన కావ్య షాక్ అవుతుంది. ఈ పూజలేంటీ? ఈ పనులు చేయడం ఏంటని కూతురిని ప్రశ్నిస్తుంది కనకం. నీ పిచ్చి చేష్టలతో ఇక్కడ ఎలాంటి పొరపాటు చేయొద్దని తల్లితో అంటుంది కావ్య.
7/9
ఈ పెళ్లి జరగదని నాకు నమ్మకం ఉందంటుంది కావ్య. ఈ పెళ్లి ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దని తల్లితో చెబుతుంది
8/9
లోపలకు వెళుతున్న కావ్యకు ఎదురుపడతాడు రాజ్. మీతో ఇప్పుడు మాట్లాడలేకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అంటాడు. కావ్యతో ఏదో చెబుతుండగా యామిని వచ్చి పిలుస్తుంది
9/9
యామిని పెళ్లి జరిపిస్తున్న పంతులుని కనకానికి చూపిస్తారు ఇందిర, అపర్ణ. ఈ పంతులు మా కాలనీలో ఉంటాడు..ఆయనకో వీక్ నెస్ ఉంది దానిపై దెబ్బకొట్టాలి అంటుంది. ఏంటా వీక్నెస్ అంటే కనకాంబరం అంటుంది కనకం..
Published at : 13 Jun 2025 10:20 AM (IST)