Guppedantha Manasu Kiran Kanth: 'గుప్పెడంతమనసు'లో గౌతమ్ (కిరణ్ కాంత్) రీ ఎంట్రీ!
గుప్పెడంత మనసు సీరియల్ లో రిషికి మంచి స్నేహితుడిగా నటించిన గౌతమ్ (కిరణ్ కాంత్) చాలా రోజులుగా సీరియల్ లో కనిపించడం లేదు. బ్రహ్మముడి సీరియల్ లో కళ్యాణ్ గా నటిస్తున్న కిరణ్ కాంత్ దాదాపు గుప్పెడంత మనసు నుంచి వెళ్లిపోయినట్టే అని ఫిక్సయ్యారంతా. కానీ ప్రస్తుతం నడుస్తున్న కథను మలుపుతిప్పేందుకు త్వరలోనే కిరణ్ కాంత్ రీఎంట్రీ ఉండబోతోందని టాక్

రిషికి ఆశ్రయం ఇచ్చిన ఏంజెల్..తన గతం గురించి ఆరాతీసేపనిలో పడింది. అదే విషయంపై వసుధారతో మాట్లాడుతూ గౌతమ్ కి మొత్తం తెలుసు తనెక్కడున్నాడో అని ప్రస్తావించింది. అంటే త్వరలోనే గౌతమ్ రీఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారనన్నమాట
ప్రస్తుతానికి గుప్పెడంతమనసు సీరియల్ మొత్తం ఓపెన్ సీక్రెట్ అన్నట్టు నడుస్తోంది.
గౌతమ్ రీఎంట్రీ ఇస్తే మబ్బులు విడిపోతాయ్. వసు-రిషి భార్య భర్త అని, మహేంద్ర-జగతి తల్లిదండ్రులనే విషయం ఏంజెల్ కు తెలుస్తుంది.
మరోవైపు దేవయాని-శైలేంద్ర నిజస్వరూపం కూడా బయటపడుతుంది. అంటే గౌతమ్ రీఎంట్రీతో సీరియస్ ఊపందుకోవడం ఖాయం...
గుప్పెడంతమనసు, బ్రహ్మముడి సీరియల్స్ కన్నా ముందు కిరణ్ కాంత్...ఉయ్యాల జంపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పౌర్ణమి, అమ్మ సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు
'గుప్పెడంతమనసు' గౌతమ్, 'బ్రహ్మముడి' కళ్యాణ్ ( కిరణ్ కాంత్) (Image credit: Kiran Kanth /Instagram)
'గుప్పెడంతమనసు' గౌతమ్, 'బ్రహ్మముడి' కళ్యాణ్ ( కిరణ్ కాంత్) (Image credit: Kiran Kanth /Instagram)