Bhanumathi Serial Today ఏప్రిల్ 05 ఎపిసోడ్: పోలీసులకు కాల్ చేసిన భానుమతి.. సవాల్ చేసిన బలరాం - భానుమతి ఏప్రిల్ 05 ఎపిసోడ్ హైలెట్స్!
పార్థుకి పన్నీటి స్నానం చేయిస్తుంటే దూరంగా నిల్చుంటారు శాంభవి, బువన. వాళ్లని పిలిచి స్నానం చేయించమంటాడు బలారం. గత్యంతరం లేక సరే అంటుంది శాంభవి
భానుమతిని అందంగా అలంకరిస్తుంది ప్రమీల. నీకు గొప్ప జీవితం రాబోతోంది.ఆ పెద్దింటి బాధ్యత నీ భుజాలపై ఉందని చెబుతుంది
పార్థు ఇష్టడే అమ్మాయే తన జీవితంలోకి వస్తోందని అంటుంది శక్తి. కొడుకుని పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి మురిసిపోతాడు బలరాం
పెళ్లితో చదువు వదిలేస్తావా అంటుంది వసు. వీళ్లంతా చెప్పే గొప్ప జీవితం నాకు వద్దు..ఏదో ఒకటి చెప్పి పెళ్లి ఆపేయాలని అంటుంది భానుమతి
పెళ్లి కొడుకుని చేసిన తర్వాత బలరాం దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు పార్థు. శారదతో మినగా మిగిలిన అందరితోనూ అక్షింతలు వేయించుకుంటాడు. బాధపడుతుంది శారద.
కుమారి ఒంటి నిండా నగలు పెట్టుకుని, పట్టు చీర కట్టుకుని ఊయల్లో ఊగుతుంటుంది. ఊర్లో అంతా నన్ను చూసి అసూయపడుతున్నారా అని అడుగుతుంది
ఈ ఇంట్లో చిన్నప్పటి నుంచి మనకు ఇష్టమైనది ఏదీ జరగలేదు..అయినా పరిస్థితులను ఎదిరిస్తూ రోజుకో కొత్త యుద్ధం చేస్తూ గెలుస్తూ వచ్చాం అనుకుంటారు భాను, వసు. రేపు నా నీట్ ఎగ్జామ్..ఎలాగైనా పరీక్ష రాసి డాక్టర్ కావాలి అంటుంది భానుమతి
నా కోసం మా నాన్న 100 మెట్లు దిగొచ్చారు..ఇలాంటి తండ్రి దొరకడం నా అదృష్టం అంటాడు పార్ధు. ఈ మాటలు విని మురిసిపోయిన బలరాం దగ్గర అప్పుడే శారద వస్తుంది. పార్థుకి ఈ ఆనందం నీవల్లే అంటాడు.
వాడిని అర్థం చేసుకున్న అమ్మాయి భార్యగా వస్తోందంటాడు దుర్గ. ఆ మాటలు విని ఇంకెంతకాలం మీ అన్న దగ్గర తలవంచుతారు అనుకుంటుంది శక్తి
పోలీసులకు కాల్ చేసిన భానుమతి తాను మైనర్ ని అని పెళ్లి చేస్తున్నారని..నా జీవితం కాపాడాలని పోలీసులకు చెబుతుంది.
భానుమతి ఏప్రిల్ 07 ఎపిసోడ్ లో తాళికట్టే టైమ్ కి పోలీసులు ఎంట్రీ ఇస్తారు.. పెళ్లి జరుగుతుందా లేదా వెయిట్ అండ్ సీ