Bhanumathi Serial Today ఏప్రిల్ 03 ఎపిసోడ్: పెళ్లి ఇష్టంలేదా బస్ అమ్మాయ్ అని అడిగిన పార్థుకి భాను రిప్లై ఏంటి - భానుమతి ఏప్రిల్ 03 ఎపిసోడ్ హైలెట్స్!
భానుమతిని చూడాలని ఉందని బయలుదేరుతాడు పార్థు. పెళ్లయ్యేవరకూ తరచూ కలుసుకోవడం మంచిది కాదని చెబుతుంది శారద. సూరితో మాట్లాడినట్టు మాట్లాడి శారదపై ఫైర్ అవుతాడు పార్థు.
మీ అమ్మ చెప్పింది నిజం అని అంటాడు బలరాం. పార్థు గురించి నీకు తెలుసు కదా అని శారదను ఓదార్చుతాడు. వాడు నిన్ను అర్థం చేసుకునేవరకూ ఎదురుచూడక తప్పదు అంటాడు
పాంప్లేట్ వెనుకరాసిన విషయాన్ని కాకుండా బంగారం గురించి చూశాడా జీపబ్బాయ్ అని బాధపడుతుంది భానుమతి. ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంది. ఇంతలో కుమారి రావడం చూసి పడిపోయేలా చేయాలని అరటి తొక్క వేస్తుంది వసు.
జారిపడిన కుమారిని అరుపులు విని కోటి, ప్రమీల వస్తారు. నువ్వు బకెట్ తన్నేస్తే భానుమతి పెళ్లి ఆగిపోతుందని అంటాడు కోటి. దీంతో పెళ్లి ఆపేందుకు మరో ప్లాన్ వేయాలి అనుకుంటారు
విశ్వనాథం ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుంది. అంతా పసుపు దంచుతారు. శాంభవి, భువనలు రగిలిపోతుంటారు.
పెళ్లి ఇష్టంలేదని నేరుగా పార్థుకి చెప్పడమే బెటర్ అని కాల్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన పిల్లలతో పార్ధుని పిలవమని చెబుతుంది. పార్థు ఫోన్ తీసుకుంటాడు..ఇంతలో కోటి రావడంతో కాల్ కట్ చేస్తుంది భానుమతి
కోటి వెళ్లిపోయాక మళ్లీ విశ్వనాథం ఇంటికి కాల్ చేస్తుంది భానుమతి..కాల్ లిఫ్ట్ చేసింది ఎవరో తెలియక ఈ పెళ్లి ఇష్టం లేదంటూ చెప్పేస్తుంది. అటువైపు శక్తి వింటుంది ఆ మాటలు.
పల్లెటూరి పిల్ల, అంతగా చదువుకోని పిల్ల పార్ధుకి భార్యగా వస్తే నా చెప్పుచేతుల్లో పెట్టుకుందాం అనుకున్నా..కానీ భానుమతి ఇంత పెద్ద షాక్ ఇచ్చింది ఏంటి అనుకుంటుంది
పార్థుని హీరోలా మార్చేస్తాడు మేకప్ మ్యాన్... పిల్లలంతా హీరోలా ఉన్నావంటూ పొగిడేస్తారు. పార్థు వదిన దిష్టి తీసి చుక్క పెడుతుంది. భానుమతి ఇంటికి వెళ్లి ఆమెకి మేకప్ వేయమని వాళ్లకి చెబుతాడు పార్థు. ఆల్రెడీ అక్కడికి ఓ అమ్మాయిని పంపించానంటాడు సూరి
భానుమతి ఏప్రిల్ 04 ఎపిసోడ్ లో... కోటి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటా అని వీరంగం వేస్తాడు. విశ్వనాథం ఇంటికి కాల్ చేసి ఈసంబంధం వద్దని చెప్పిందనే నిజం బయటపెడతాడు. ఇంతలో పార్థు కాల్ చేసి ఈ పెళ్లి ఇష్టంలేదా అని అడుగుతాడు...