Geetha Madhuri Photos: గీతా మాధురి ఎంత అందంగా ఉందో

గీతామాధురి -Image credit: GeethaMaduri/Instagram
టాలీవుడ్ సింగర్ గీతా మాధురి.. ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సింగర్ గా చాలా పాటలతో మెప్పించిన గీతా..బిగ్ బాస్ సీజన్ 2 లో రన్నర్ గా నిలిచింది. దాదాపు దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ… `బిగ్‌బాస్2` తో ఈమె మరింత ఫేమస్ అయ్యింది.
సినీ నటుడు నందూని వివాహం చేసుకున్న గీతా మాధురికి దాక్షాయణి ప్రకృతి అనే కుమార్తె ఉంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే గీతా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
చక్కని గాత్రం మాత్రమే కాదు అందమైన రూపం కూడా గీతామాధురి సొంతం. 2008లో వచ్చిన 'నచ్చావులే' సినిమాలోని ‘నిన్నే నిన్నే’ పాటతో ప్రేక్షకులకు చేరువైంది. ఆ పాటకు నంది అవార్డు కూడా అందుకుంది. చిరుతలో చమ్కీ చమ్కీ చమ్కీరే సాంగ్ తో భలే క్రేజ్ వచ్చింది.
లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీలో కచ్చర్లకోట పద్మావతి, రామాచారిల వద్ద శాస్త్రీయ, సినీ, లలిత సంగీతంలో శిక్షణ పొందింది గీత. కులశేఖర్ దర్శకత్వం వహించిన 'ప్రేమలేఖ రాశా' సినిమాలో ఒక పాటతో ఆమె సినీ రంగప్రవేశం చేసింది.
సినిమా పాటలతో పాటు, స్టేజ్ షోలు, రియాలిటీ షోలతో మంచి పేరు సంపాదించుకుంది గీతా
గీతామాధురి -Image credit: GeethaMaduri/Instagram
గీతామాధురి -Image credit: GeethaMaduri/Instagram
గీతామాధురి -Image credit: GeethaMaduri/Instagram