Yash: ముంబై ఎయిర్ పోర్టులో రాఖీ భాయ్ సందడి
ABP Desam | 07 Feb 2023 02:51 PM (IST)
1
‘కేజీఎఫ్‘ సినిమాతో కన్నడ నటుడు యశ్ దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు.
2
తెలుగు దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో పవర్ ఫుల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు.
3
బంగారు గనుల్లో జీవచ్ఛవాలుగా బతుకీడుస్తున్న ఎందరో అభాాగ్యుల దాస్య శృంకాలు తెంచే వీరుడిగా అదరహో అనిపించాడు.
4
‘కేజీఎఫ్-2‘తో తనలోని నటుడిని మరో స్థాయికి తీసుకెళ్లాడు.
5
పవర్ ఫుల్ యాక్షన్ సీన్లలో ఆడియెన్స్ ను రాఖీ భాయ్ మెస్మరైజ్ చేశాడు.
6
యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్.
7
2004 లో ‘ఉత్తరాయణ‘ అనే టీవీ సీరియల్ ద్వారా తన కెరీర్ మొదలు పెట్టి, పలు సీరియల్స్ లో నటించాడు.
8
రాధిక పండిట్ అనే తోటి నటిని ప్రేమించి 2016లో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి ఓ పాప ఉంది.
9
2007లో ‘జంబాడా హుడుగి‘ అనే సినిమాతో వెండితెరపై అడుగు పెట్టాడు.
10
‘కేజీఎఫ్‘తో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు.