Shivathmika Photos : ఓనమ్ లుక్‌లో శివాత్మిక.. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కలువలోచన
హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలో కొత్త పోస్ట్ చేసింది. ఓనమ్ లుక్‌లో ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ పోస్ట్‌లో తన అక్క శివాని ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేసింది. వారిద్దరి మధ్య బంధాన్ని ఈ అక్కచెల్లెల్లు ఎప్పుడూ బహిర్గతంగా వ్యక్తం చేసుకుంటూనే ఉంటారు.
ఈ ఓనమ్ లుక్‌లో శివాత్మిక చాలా సింపుల్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపించింది. తన చెవులకు భారీ జుంకాలు ధరించి.. ఓ బొట్టుతో సింపుల్‌గా రెడీ అయింది.
రాజశేఖర్, జీవితా కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. మొదటి సినిమాలో ఆనంద దేవరకొండకు జతగా నటించింది.
దొరసాని సినిమా విజయం సాధించకపోయినా.. దానిలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూ.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగుతో పాటు.. తమిళంలో కూడా ఈ భామ కథా ప్రాధన్యమున్న పాత్రలు ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది.