Ritika Singh : జిమ్ లో బాక్సింగ్ బ్యూటీ సెగలు..రితికా సింగ్ ఫొటోస్ చూశారా!
కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ లో సత్తా చూపించి..ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది రితికా సింగ్. సుధా కొంగర తెరకెక్కించిన సాలా ఖదూస్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రితికా సింగ్.. ఆ మూవీ రీమేక్ గా వచ్చిన గురుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
తమిళంలో మాధవన్, తెలుగులో వెంకటేష్..రెండు సినిమాల్లోనూ రితికానే నటించింది..ఆ మూవీ సక్సెస్ కావడంతో వరుస ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత తెలుగు కన్నా తమిళ మూవీస్ లోనే ఎక్కువగా నటించింది.
రీసెంట్ గా మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తెలుగు వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్ లో నటించింది రితికా సింగ్. ప్రస్తుతం రజనీకాంత్ వెట్టయాన్ లో యాక్ట్ చేస్తోంది...మరిన్ని ఆఫర్లు అమ్మడి చేతిలో ఉన్నాయి..
కోలీవుడ్ లో కట్టలై, శివలింగా, ఓ మై కడవులే లాంటి సక్సెస్‌ఫుల్ మూవీస్ లో మెరిసింది...
కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో అంతకుమించి యాక్టివ్ గా ఉంటుంది రితికా సింగ్..ఆమె లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవే..
Image Credit: Ritika Singh/Instagram