Rakul Preet Singh Photos: ఎల్లో డ్రెస్సులో స్టైలిష్ గా ఓబులమ్మ
టాలీవుడ్ టాప్ 5 హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. ఈ మధ్య తెలుగు సినిమాలు తగ్గించిన రకుల్ బీటౌన్లో జోరుమీదుంది. మరోవైపు త్వరలో పెళ్లి చేసుకోనున్న రకుల్ ఈ మధ్యే తన ప్రియుడిని పరిచయం చేసింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ అప్ డేట్ లో ఉంటోంది ఓబులమ్మ.
ఇటీవల ఆమె నటించిన `మర్జావాన్`, `సిమ్లా మిర్చి`, `సర్దార్ కా గ్రాడ్సన్` ఫ్లాప్ అయినా తెలుగులో వచ్చిన కొండపొలం మంచి ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదు బాలీవుడ్ మూవీస్ ఉన్నాయి. ఈ హడావుడి అంతా అయ్యాక పెళ్లిచేసుకుంటుందేమో చూడాలి.
రకుల్ నటించిన నాలుగు హిందీ సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 'రన్ వే 34'తో పాటు 'ఎటాక్', 'డాక్టర్ జి', 'థాంక్ గాడ్' సినిమాలు వచ్చే ఏడాది విడుదల అవుతున్నాయి. 'రన్ వే 34'లో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్, ఆకాంక్షా సింగ్ నటిస్తున్నారు. 'డాక్టర్ జి'లో ఆయుష్మాన్ ఖురానా సరసన ఆమె కథానాయిక. 'ఎటాక్'లో జాన్ అబ్రహం హీరో.
రకుల్ ప్రీత్ సింగ్( Image Credit: Rakul Preet Singh/ Instagram)