కారులో ఫొటోలకు పోజులిస్తున్న రాశి ఖన్నా
ABP Desam | 14 Dec 2023 03:14 AM (IST)
1
హీరోయిన్ రాశి ఖన్నా తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో ఆమె కారులో ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం రాశి ఖన్నా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. హిందీ, తమిళ భాషల్లో రాశి సినిమాలు చేస్తున్నారు. తెలుగులో చివరిసారిగా గతేడాది విడుదల అయిన ‘థ్యాంక్యూ’ సినిమాలో రాశి కనిపించారు. ఆ తర్వాత మరే సినిమాలో నటించలేదు.
2
తమిళంలో ‘అరణ్మనై 4’, ‘మేథావి’ అనే సినిమాల్లో నటిస్తున్నారు.
3
వీటిలో ‘అరణ్మనై 4’ సంక్రాంతికి విడుదల కానుంది.
4
‘రుద్ర’, ‘ఫర్జీ’ వెబ్ సిరీస్‌ల్లో కూడా రాశి నటించారు.
5
ఇవి రెండూ సూపర్ సక్సెస్ అయ్యాయి.
6
త్వరలో ‘ఫర్జీ సీజన్ 2’ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.