Priyamani Photos: నెలవంకలా వెలిగిపోతున్న ప్రియమణి
వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది ప్రియమణి. రీసెంట్ గా వచ్చిన 'భామా కలాపం' లో అనుపమ ఘుమ ఘుమ అంటూ యూట్యూబ్ లో వంటలు చేసే గృహిణిగా ఆకట్టుకుంది. ఫ్యామిలీ మాన్ సిరీస్ తో ప్రియమణి బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీజన్ వన్ తో పాటు సీజన్ 2లో కూడా నటించింది ప్రియమణి.
తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో కలిపి అరడజనుకి పైగా సినిమాలతో బిజీగా ఉంది ప్రియమణి. వీటిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రానా-సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న విరాట పర్వం మూవీలో ప్రియమణి లేడీ నక్సల్ రోల్ చేస్తోంది.
బుల్లితెరపైనా ఓ డాన్స్ షోకి జడ్జిగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది ప్రియమణి. ఇక ప్రియమణి వ్యక్తిగత జీవితంపై కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి. భర్త ముస్తఫా రాజ్ తో ఆమె విడిపోతోందని అన్నారు. దీపావళి వేడుకల్లో జంటగా కనిపించి ఆ రూమర్స్ కి చెక్ పెట్టింది ప్రియమణి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియమణి తాజాగా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
ప్రియమణి (Image courtesy - @ Priyamani/Instagram)
ప్రియమణి (Image courtesy - @ Priyamani/Instagram)
ప్రియమణి (Image courtesy - @ Priyamani/Instagram)