Vikkatakavi Series : న్యూ సిరీస్‌తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
పెళ్లి తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వెబ్ సిరీస్‌తో రాబోతుంది మేఘా ఆకాష్. నరేష్ అగస్త్య హీరోగా వస్తోన్న వికటకవి సిరీస్‌లో మేఘా హీరోయిన్గా చేస్తుంది. (Images Source : Pressmeet)
నరేష్ అగస్త్య పలు సీరియల్స్, వెబ్ సిరీస్‌లతో ఇప్పటికే ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మత్తు వదలరా సినిమాతో క్రేజ్ కూడా బాగా పెరిగింది. (Images Source : Pressmeet)
ఈ కథను ముందుగా ఫీచర్ ఫిల్మ్ అనుకుని.. తర్వాత కంటెంట్‌ని వెబ్ సిరీస్‌గా తీసుకోవచ్చారు. ఈ వెబ్ సిరీస్ ZEE5లో నవంబర్ 28వ తేదీనుంచి స్ట్రీమింగ్ కానుంది. (Images Source : Pressmeet)
ఈ సిరీస్‌లో క్లైమాక్స్‌ని ఎవరూ ఊహించలేరని వికటకవి సిరీస్ టీమ్ తెలిపింది. కెమెరా వర్క్, కాస్ట్యూమ్స్, మ్యూజిక్ ఇలా అన్ని ఈ సిరీస్‌కి బాగా సెట్ అయ్యాయని ప్రెస్ మీట్లో తెలిపారు. (Images Source : Pressmeet)
ఈ సిరీస్ కచ్చితంగా మంచి హిట్ అవుతుందని.. ననరేష్ అగస్త్య, మేఘా ఆకాశ్ నటనకు ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అవుతారని తెలిపారు.(Images Source : Pressmeet)