Athiradi OTT: మిక్స్డ్ రివ్యూలతో 65 కోట్లు కలెక్ట్ చేసిన మలయాళ సినిమా... ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

మలయాళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన 'అతిరడి' సినిమా త్వరలో డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. టోవినో థామస్, బసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ కామెడీ సోనీ లివ్ ఓటీటీలోకి రానుంది. (Image Courtesy: ibasiljoseph / Instagram)
Athiradi OTT Platform Release Date: మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది విడుదలైన యాక్షన్ కామెడీ ఫిల్మ్ 'అతిరడి'. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. (Image Courtesy: ibasiljoseph / Instagram)
Athiradi 2026 OTT Release Date: 'అతిరడి' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ (Sony LIV) ఓటీటీ సొంతం చేసుకుంది. జూన్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. (Image Courtesy: ibasiljoseph / Instagram)
'అతిరడి'లో టోవినో థామస్, బసిల్ జోసెఫ్, రియా షిబు, వినీత్ శ్రీనివాసన్ ప్రధాన తారాగణం. ఇతర కీలక పాత్రలలో జరీన్ షిహాబ్, షాన్ రెహమాన్, విష్ణు అగస్త్య, పి. సుకుమార్ నటించారు. (Image Courtesy: ibasiljoseph / Instagram)
'అతిరడి' లైఫ్ టైమ్ వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 65 కోట్లు. మలయాళంలో ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. (Image Courtesy: ibasiljoseph / Instagram)
మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో 'అతిరడి' సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి విష్ణు విజయ్ సంగీత దర్శకుడు. (Image Courtesy: ibasiljoseph / Instagram)