Nayantara Family Photos : భర్త, పిల్లలతో కలిసి క్రిస్మస్ వేడుకలు చేసుకున్న నయనతార
లేడి సూపర్ స్టార్ నయనతార తన కవల కొడుకులతో కలిసి క్రిస్మస్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది.
నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలు చూసేందుకు మస్త్ క్యూట్‌గా ఉన్నారు.
సరోగసీ పద్దతిలో లేడి సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
పిల్లలతో కలిసి దంపతులిద్దరూ ఆడుకుంటూ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విగ్నేశ్ గణేషన్ ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆయన అలా పోస్ట్ పెట్టగానే అభిమానులు లైక్‌ల వర్షం కురింపించారు.
నయన్-విఘ్నేష్ పిల్లల పేర్లు ఉయిర్, ఉలగమ్. ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న నయన తార , విఘ్నేష్ శివన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సరోగసీ ద్వారా ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చారు.
తాజాగా నయనతార హీరోయిన్‌గా నటించిన ‘అన్నపూర్ణి’ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.