పింక్ దుస్తుల్లో గులాబిని తలపిస్తున్న సదా
జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సదా కొంత కాలం పాటు విజయపథాన కొనసాగింది. ఉదయకిరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్రతారల సరసన కూడా నటించింది. ఆమె సినిమాలు కొన్ని బ్లాక్ బాస్టర్స్ అయితే ప్రాణం లాంటి కొన్ని సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సదా కొన్ని టెలివిజన్ రియాలిటీ షోలలో జడ్జిగా మెప్పిస్తోంది. ఇక ముందు జబర్దస్త్ లోనూ జడ్జిగా కొనసాగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి మెప్పించగలగుతుందనే ఆశిద్దాం. అటు బుల్లి తెర ద్వారా, సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉంటుందని చెప్పొచ్చు.
సదా ఢీ రియాలిటీ డాన్స్ షోకు రెండు సీజన్లలో జడ్జిగా వ్యవహరించారు.
వెండితెరకు దూరమైనా సదా ప్రేక్షకులకు దగ్గరగానే ఉన్నారు
ఇండస్ట్రీకి పరిచయమై రెండు దశాబ్ధాలు దాటినా ఆమె గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి.
అపరిచితుడు, జయం సదా కెరీర్ లో మైలురాళ్లు