Manushi Chhillar Pics: మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ స్టైలిష్ లుక్.. ఫొటోలు చూస్తే ఫిదా!
మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ ‘పృథ్వీరాజ్’ మూవీతో బాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందులో అక్షయ్ కుమార్ సరసన జత కట్టింది. (Courtesy: Instagram)
హిందీ చిత్ర పరిశ్రమలో అరంగేట్రానికి ముందే, మానుషి చిల్లర్ 'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' అనే కామెడీ చిత్రంలో విక్కీ కౌశల్ సరసన నటించారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన ఈ మూవీని యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. (Courtesy: Instagram)
హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ భారత్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ అందుకున్న ఆరవ బ్యూటీగా నిలిచింది. మరోవైపు వైద్య డిగ్రీ చదువుతూనే మోడలింగ్, సినిమాల వైపు ఆకర్షితురాలైంది. కూచిపూడిలో ఆమెకు నైపుణ్యం ఉంది. (Courtesy: Instagram)
ప్రముఖ మెక్సికన్ చిత్రకారిణి ఫ్రిదా కహ్లో రచనల నుండి ప్రేరణ పొంది ఆమె దుస్తులు రూపొందించారు. ఈ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. (Courtesy: Instagram)
మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది. తన మూవీ ‘పృథ్వీరాజ్’పై ఎన్నో ఆశలు పెట్టుకుంది (Courtesy: Instagram)