Aiswarya Raj: మలయాళ మందారం...అందాల అరవిందం... ఐశ్వర్య On Duty
ఇప్పుడు OTT టాక్ అంతా కూడా Officer On Duty మూవీ గురించే. Netflixలో స్ట్రీమ్ అవుతున్న ఈ మలయాళీ మూవీలో లీడ్ రోల్ చేసిన Kunchacko Boban అదరగొట్టాడు. అయితే అంతకు మించి Aiswarya నటకు ఫిదా అయిపోతారు.
నీలికళ్లు... ఉంగరాల జుట్టుతో ఈ అమ్మాయి కుర్రాళ్లను పడగొట్టేసింది. Officer On Duty లో Anna Louis కేరక్టర్‌లో అదరగొట్టింది.
చేసింది నెగటివ్ రోలే కానీ.. ఆ కేరక్టర్‌కు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది.
Aiswarya Raj కు ఇది మొదటి సినిమా.. డెబ్యూ మూవీలోనే పూర్తి నెగటివ్ షేడ్ ఉన్న కేరక్టర్‌తో అందరినీ కట్టిపడేసిందీ అమ్మాయి
డ్రగ్స్‌కు ఎడిక్ట్ అయ్యి కిల్లర్ గ్యాంగ్‌గా మారిన మెడికల్ స్టూడెంట్స్ బృందంలో ఓ మెంబర్ Anna Louis. ఆ కేరక్టర్‌ను పర్‌ఫెక్ట్‌గా లీడ్ చేసింది
సినిమాలో ఆ గ్యాంగ్‌లో ఉన్న అందరూ కూడా అద్భుతంగా నటించారు. ఫిభ్రవరిిలో కేరళలో రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ఈ మూవీకి ఓటీటీలో కూడా విపరీతమైన పాజిటివ్ పబ్లిసిటీ వచ్చింది. మెయిన్ లీడ్ చేసిన వాళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ బెస్ట్ అప్రిషియేషన్ వచ్చింది.
ముఖ్యంగా అన్నా కేరక్టర్‌కు కుర్రాళ్లు పడిపోయారు. ఈ సినిమాలో ఈ గ్యాంగ్‌కు ఎక్కువ మాటలు లేవు. కళ్లతోనే ఎక్స్‌ప్రెషన్స్ చూపించాలి. దానిని కొత్తమ్మాయి అయినా పర్‌ఫెక్ట్‌గా చేసేసింది.
Aiswarya Raj జర్నలిజం స్టూడెంట్. ఫైనలియర్ పీజీ చేస్తున్న తాను ఆడిషన్ ద్వారా ఈ సినిమాకు ఎంపికైంది. సినిమా నటనలో అనుభవం లేనప్పటికీ.. ఐశ్వర్యకు కాలేజీలో స్టేజ్ షోలు చేసిన అనుభవం ఉంది
సినిమా కోసం ఈ గ్యాంగ్ మొత్తానికి వర్క్‌షాప్స్ నిర్వహించారు.
మలయాళం ఇండస్టీలో నయా సన్షేషన్ ఐశ్వర్య.. ఫ్యూచర్ స్టార్ కాబోతోందని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
సౌత్‌లో మలయాళం ఇండస్ట్రీ నుంచే ఎక్కువుగా యాక్ట్రస్‌లు వస్తున్నారు. ఇప్పుడు యంగ్ జనరేషన్‌లో వాళ్ల హవా ఎక్కువుగా ఉంది. ఐశ్వర్య కూడా అదే టీమ్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.