Kriti Sanon : కృతిసనన్ స్టన్నింగ్ ఫోటోషూట్.. వైట్ డ్రెస్‌లో క్యూట్ ఫోజులిచ్చిన హీరోయిన్
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లలో కృతి సనన్ ఒకరు. ఈ భామ తాజాగా వైట్ డ్రెస్‌లో లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. వైట్ మినీ స్కర్ట్‌లో వైట్ థీమ్‌లో ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/kritisanon)
గోల్డెన్ జ్యూవెలరీ పెట్టుకుని ఫోటోలకు మంచి ఫోజులిచ్చింది. చేతులకు కడియం, చెవులకు రింగులు పెట్టుకున్న కృతి మినిమల్ మేకప్ లుక్‌లో పింక్ లిప్ స్టిక్ పెట్టుకుని ఫోటోషూట్ చేసింది. వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. (Images Source : Instagram/kritisanon)
ఈ భామ కేవలం బాలీవుడ్లోనే కాదు టాలీవుడ్లో కూడా సినిమాలు చేసింది. తెలుగులో 1 నెనొక్కడినే సినిమాతో మహేశ్ బాబు సరసన నటించింది. ఈ సినిమా హిట్ టాక్ని పొందింది. ఆమె నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. (Images Source : Instagram/kritisanon)
తర్వాత నాగచైతన్యతో కలిసి దోచేయ్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించినంత ఫలితం ఇవ్వకపోవడంతో టాలీవుడ్ సినిమాలకు బాయ్ చెప్పి బాలీవుడ్ సినిమాలు చేస్తుంది. పలు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.(Images Source : Instagram/kritisanon)
మిమి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కృతి సనన్. సరోగసి ద్వారా తల్లిగా మారి ఓ బిడ్డకు జన్మనిచ్చిన పాత్రలో కృతి ఒదిగిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ హీరోయిన్గా అవార్డు వచ్చింది.(Images Source : Instagram/kritisanon)
2023లో ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో జానకిగా నటించింది. ఈ సినిమా ఆశించినంత ఫలితం దక్కించుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో ఆమె నటించిన పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.(Images Source : Instagram/kritisanon)