Karthika Deepam Shobha Shetty: కార్తీకదీపం నుంచి పంపించేశారంటూ మోనిత కన్నీళ్లు!
‘కార్తీకదీపం’లో మోనిత క్యారెక్టర్ అయిపోయింది. ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది.. మీ క్యారెక్టర్ అయిపోయింది అని చెప్పారు. మోనితగా శోభాశెట్టి కెరియర్‌ని టర్న్ చేసిన సీరియల్ ఇది.
నా లైఫ్‌లో చాలా సీరియల్స్ చేశాను, చాలా రోల్స్ చేశాను కానీ ఎప్పుడూ ఇంత బాధపడలేదంటూ చెప్పుకొచ్చింది మోనిత
రీ ఎంట్రీ తరువాత మళ్లీ ఐదునెలలు మాత్రమే వర్క్ చేశాను. కార్తీకదీపం నెక్స్ట్ షెడ్యూల్ కోసం అన్నీ రెడీ చేసుకున్నా. జైలు వెళ్లిన తరువాత మళ్లీ రీ ఎంట్రీ ఉంటుందని ఎదురుచూస్తున్నా..కానీ సీరియల్ నుంచి తీసేశామని చెప్పారు..ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదంది శోభా
తనను కావాలని తీసేయలేదని..కథ అలా టర్న్ అయ్యిందని చెప్పుకొచ్చింది శోభాశెట్టి. కథను ఆసక్తికరంగా మలచాలంటే తనను తీసేయడం తప్ప వేరే ఆప్షన్ లేదంది.
కథ ప్రకారం మోనిత గురించి మొత్తం కార్తీక్ కి తెలిసిపోయింది..ఇక నమ్మనే నమ్మడు..కథలో కొత్తదనం ఉండదు కాబట్టే తీసేశారని చెప్పుకొచ్చింది
ప్రస్తుతం మోనిత ప్లేస్ లో చారుశీల అనే కొత్త విలన్ ను ఎంటర్ చేశారు...ఇప్పుడు కథను నడిపిస్తున్నది ఆమెనే.
ఇక్కడితో నా జర్నీ అయిపోయిందని అనుకోవడం లేదు.. మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ మీతోనే ఉంటానంది మోనిత
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)
శోభా శెట్టి (image credit: ShobhaShetty/Instagram)