Karthika Deepam Sowjanya: కార్తీకదీపంలో మోనిత పోయె చారుశీల వచ్చే, ఈమె గురించి తెలుసా!
కార్తీకదీపం ప్రస్తుతం నడుస్తున్న ఎపిసోడ్స్ లో మెయిన్ విలన్ ఈమె...సీరియల్ లో డాక్టర్ చారుశీలగా నటిస్తోన్న ఈమె అసలు పేరు సౌజన్య
కార్తీకదీపం సీరియల్ లో మోనిత క్యారెక్టర్ జైలుకి వెళ్లడంతో..ఇక ఆమె పాత్రకు చెక్ పెట్టినట్టే అన్నారు. అది నిజమే అని మోనితగా నటించిన శోభాశెట్టి కూడా అఫీషియల్ గా చెప్పేసింది. మరి సీరియల్ లో కొత్త విలన్ ఎవరో రీసెంట్ గా రివీల్ అయింది...అదే డాక్టర్ చారుశీల...
కార్తీక్-దీపకి సపోర్ట్ గా ఉన్నట్టు నటిస్తోన్న చారుశీల రీసెంట్ గా తనలో మరో యాంగిల్ బయటపెట్టింది. మోనిత తనను చదివించిందని..తను కోరిన కోర్కె ప్రకారం దీప-కార్తీక్ ను శాశ్వతంగా విడగొట్టడమే తన పని అని..అందుకే దీపకు లేని రోగం అంటగట్టానని చెప్పింది. ఈ లెక్కన అందమైన విలన్ గా మెప్పించిన మోనిత స్థానంలోకి ఇప్పుడు మరోఅందమైన విలన్ చారుశీల వచ్చినట్టే...
కార్తీకదీపంలో డాక్టర్ చారుశీలగా నటిస్తోన్న ఈమె అసలు పేరు సౌజన్య. మొగలిరేకులు సీరియల్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్న శిరీషకు అక్క సౌజన్య. వీరి స్వస్థలం తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల. సౌజన్య కూడా వరుస సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు కార్తీకదీపంలో విలన్ గా ఎంట్రీ ఇచ్చింది...మరి మోనిత (శోభాశెట్టి) లా చారుశీల (సౌజన్య) పాత్ర కూడా ఆ రేంజ్ క్రేజ్ అందుకుంటుందేమో చూడాలి... (image credit: Sowjanya/Instagram)
కార్తీకదీపం చారుశీల (సౌజన్య) (image credit: Sowjanya/Instagram)
కార్తీకదీపం చారుశీల (సౌజన్య) (image credit: Sowjanya/Instagram)
కార్తీకదీపం చారుశీల (సౌజన్య) (image credit: Sowjanya/Instagram)