Jr NTR News: బామ్మర్ది మూవీ సక్సెస్ - ‘ఆయ్’ మూవీ టీమ్‌ను అభినందించిన ఎన్టీఆర్

Jr Ntr Congratulates AAY Movie Team | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ మ్యాడ్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ‘ఆయ్’తో మరో సక్సెస్ సాధించారు నార్నే నితిన్.

Continues below advertisement

బామ్మర్ది కోసం వచ్చిన ఎన్టీఆర్, ‘ఆయ్’ మూవీ టీమ్‌ను అభినందించిన యంగ్ టైగర్

Continues below advertisement
1/4
మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రం ఆగ‌స్ట్ 15న రిలీజైంది. తొలి ఆట నుంచే సినిమా పాజిటివ్ బ‌జ్‌తో ఇటు ప్రేక్ష‌కుల‌ను, అటు విమ‌ర్శ‌కుల‌ను మెప్పించి సూప‌ర్ హిట్ టాక్‌తో మంంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది.
2/4
ఆయ్ స‌క్సెస్‌పై చిత్ర యూనిట్‌కు పాజిటివ్ రివ్యూస్ రావ‌టంతో పాటు టీమ్ ఎఫ‌ర్ట్‌ను అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న‌ ఆయ్ టీమ్‌కు మ‌రో అద్భుత‌మైన ప్ర‌శంస దక్కింది. అదెవ‌రి నుంచో కాదు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి.
3/4
స్టార్ హీరో జూ. ఎన్టీఆర్ చిత్ర యూనిట్‌ను ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నారు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ట్టి పోటీ ఉన్న‌ప్ప‌టికీ ‘ఆయ్’ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌టంపై ఎన్టీఆర్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. తార‌క్‌ను చిత్ర నిర్మాత బ‌న్నీ వాస్‌, హీరో నార్నే నితిన్‌, నిర్మాత ఎస్.కె.ఎన్, హీరోయిన్ న‌య‌న్ సారిక‌, అంకిత్ కొయ్య‌, రాజ్ కుమార్ క‌సిరెడ్డి క‌లుసుకున్నారు.
4/4
ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో నుంచి ప్ర‌శంస‌లు ద‌క్క‌టం అనేది ఆయ్ చిత్ర యూనిట్‌లో స‌రికొత్త ఉత్సాహాన్నిస్తుంద‌న‌టంలో సందేహం లేదు. మంచి కంటెంట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతోంది. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాత‌లుగా గోదావరి బ్యాక్ డ్రాప్‌లో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆయ్ చిత్రం రూపొందింది. అంజి కె.మ‌ణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అయ్యారు.
Sponsored Links by Taboola