Janhvi Kapoor : సాంప్రదాయిని లుక్‌లో జాన్వీ కపూర్
మార్చి 6వ తేదీన పుట్టిన రోజు సింపుల్‌గా చేసుకుంది. లంగా ఓణి కట్టుకుని తలలో పువ్వులు పెట్టుకుని ట్రేడీషనల్గా ముస్తాబైంది.(Images Source : Instagram/ janhvikapoor)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజాన్వీకి తిరుపతికి విడదీయరాని బంధం ఉంది. ఈ పుట్టిన రోజుకి కూడా తిరుపతి వెళ్లి వెంకన్న స్వామి దర్శనం చేసుకుంది. బాయ్ ఫ్రెండ్, పిన్నితో కలిసి తిరుపతిలో దర్శనం చేసుకుంది జాన్వీ.(Images Source : Instagram/ janhvikapoor)
బర్త్‌డే స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది జాన్వీ. వాటికి Thank you for the birthday love 🙏🏼 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/ janhvikapoor)
అలనాటి హీరోయిన్ శ్రీదేవి కుమార్తేగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. ఇప్పటివరకు బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా మంచి పేరు సంపాదించుకుంది.(Images Source : Instagram/janhvikapoor)
ప్రస్తుతం తెలుగులోకి ఈ నటి ఎంట్రీ ఇస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరలో జాన్వీ హీరోయిన్గా నటిస్తుంది. రామ్ చరణ్ సరసన కూడా ఈమె నటిస్తుంది. (Images Source : Instagram/janhvikapoor)
కేవలం ఈమె నటనకు, అందానికే కాకుండా ఈమె ఫ్యాషన్‌కు కూడా అభిమానులున్నారు. ట్రెడీషనల్ అయినా, ట్రెండీ అయినా, సూపర్ ట్రెండీ దుస్తుల్లో కూడా జాన్వీ అందరినీ ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/janhvikapoor)