Jabardast Satya Sri Photos: జబర్దస్త్ ఫేం సత్యశ్రీ ఫ్యాషన్ లుక్ చూశారా? మతిపోవాల్సిందే..
ఫ్యాషన్ లుక్ లో షాకిచ్చిన జబర్దస్త్ సత్య శ్రీ (Image Credit: me_satyasri/Instagram)
జబర్దస్త్’ కామెడీ షో ద్వారా చాలా మంది కమెడియన్లు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో చక్కగా రాణిస్తున్నారు.
కొందరు ఏకంగా హీరోలుగా మారిపోగా, మరికొంత మంది కమెడియన్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరు సత్యశ్రీ.
‘జబర్దస్త్’ వేదికపై చక్కటి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న సత్యశ్రీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
ఓవైపు ‘జబర్దస్త్’ షో చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో చాన్స్ కొట్టేసిన ఆమె షూటింగ్‌లోనూ పాల్గొంది.
ఓవైపు ‘జబర్దస్త్’ షో చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో చాన్స్ కొట్టేసిన ఆమె షూటింగ్‌లోనూ పాల్గొంది.
అయితే జబర్దస్త్ షో నుంచి కూడా బయటకు వచ్చిన ఆమె దానికి కారణం ఏంటో గతంలో పలు ఇంటర్య్వూలో వెల్లడించింది. కేవలం చమ్మక్ చంద్ర కోసమే గతంలో ‘జబర్దస్త్’ నుంచి బయటకు వెళ్లినట్లు చెప్పింది.
కానీ, ఏనాడు ఆ షో నుంచి బయటకు ఎందుకు వచ్చానా? అని ఆలోచించలేదని చెప్పింది. “చంద్ర కోసమే ‘జబర్దస్త్’ నుంచి బయటకు వచ్చాను.
ఇతర కారణాలు ఏవీ లేవు. బయటకు అనవసరంగా వచ్చాం అని ఎప్పుడూ అనిపించలేదు. ‘కామెడీ స్టార్స్’ తర్వాత నేను సినిమాల్లో బిజీ అయ్యాను.